ఏపీ పోలీసుల వ్యవహారశైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు ఒత్తిడికి లొంగిపోతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు ఫిర్యాదు చేసినా.. స్వీకరించాల్సిన పోలీసులు.. తాము చేస్తున్న ఫిర్యాదుల్ని అస్సలు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫిర్యాదుల్ని పోలీసులు అస్సలు పట్టించుకోవటం లేదంటున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఇంఛార్జి మధుసూదన్ రెడ్డి.. రవికిరణ్లను పోలీసులు విచారించారు. తాము ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు విచారణకు మరోసారి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల విచారణ అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రవికిరణ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లింకు పెట్టేలా పోలీసులు తనను ప్రశ్నలు అడిగినట్లుగా చెప్పారు. రవికిరణ్ తో జగన్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్లుగా తెలిపారు. పార్టీకి రవికిరణ్ తో సమా పలువురు వాలంటీర్లు ఉన్నారని.. వారందరినీ పోలీసులు ఉద్యోగులుగా భావిస్తున్నారన్నారు.
వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న టీడీపీ అధికారిక వెబ్ సైట్ పై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న మధుసూదన్ రెడ్డి.. ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించాల్సి ఉన్నా.. ఒత్తిడితో ఆ పని చేయటం లేదన్నారు. రవికిరణ్ కు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య లింకెట్టేలా పోలీసులు ప్రయత్నాలు చే్స్తున్నట్లుగా ఆయన ఆరోపించారు. ఈ తరహా విమర్శల నేపథ్యంలో తుళ్లూరు పోలీసుల తీరు ఎలా ఉంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/