విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎన్నికల ముందు భారీ షాక్ తగిలింది. ఉమతో పాటు - అతని కుమారుడిపై హత్య కేసు నమోదు అయ్యింది. అది కూాడా తెలంగాణలో వీరిపై కేసు నమోదైంది. బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రెండో సారి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ సమయంలో ఈ కేసు తెరపైకి రావడం పార్టీకి కూడా షాకింగే.
ఇవీ వివరాలు... రెండు సంవత్సరాల క్రితం తన కూతురు సాయిశ్రీ అనుమానాస్పదంగా మరణించిందని - ఆమె మృతికి బోండా ఉమ - ఆయన కుమారుడు శివ కారణమని సుమనశ్రీ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషను విచారించిన కోర్టు బోండా ఉమ - ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫిర్యాదు దారి పరిధిలోని సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమపై కేసు పెడితే తనకు ప్రాణ హాని తలపెడతారని, ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలు సుమనశ్రీ ఆందోళన వ్యక్తంచేశారు. తనకు భద్రత కల్పించాలని - నాకు ఏం జరిగిన బోండా ఉమదే బాధ్యత అని సుమనశ్రీ అన్నారు.
తెలుగుదేశం ఎమ్మెల్యేగా బోండా ఉమ నా లాంటి చాలామందిని ఇబ్బందిపెట్టారని ఈ ఎన్నికల్లో అలాంటి వారిని పదవులకు దూరంగా ఉంచకపోతే ఇంకా ఎంతో మంది బలవుతారని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.