బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు...కారణం ఇదే!

Update: 2020-08-14 08:10 GMT
ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై పోలీసు కేసు న‌మోదైంది. ఆగస్టు 5 వ తేదీన అయోధ్య రామాలయ భూమిపూజను ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు సాధినేని యామినిపై ఐపిసి సెక్షన్ 505(2) - 500 కింద కేసు నమోదు చేశారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం రోజు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ఎస్ వి బి సి భక్తి ఛానల్ లో రామమందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని  - హిందువుల కోసం - ధార్మిక కార్యక్రమాల కోసం నిర్వహించే ఛానల్లో అయోధ్య రామ మందిర శంకుస్థాపన ప్రసారం చేయకపోవడం చాలా దారుణం అంటూ మాట్లాడింది.

తిరుమలకు వెళ్లే రాజకీయ ప్రముఖుల, స్వామీజీలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రత్యక్ష  ప్రసారం చేసే టిటిడి  దేశ చరిత్రలో అగ్ర స్థానంలో  నిలిచిపోయే రామమందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా రామమందిర శంకుస్థాపన ఆసక్తిగా తిలకిస్తే హిందువుల కోసం నిర్వహించే ఛానల్ లో ప్రసారం చెయ్యకపోవటం దారుణం అని  ఆగ్రహం వ్యక్తం చేసారు. యామిని..సోష‌ల్ మీడియా ద్వారా తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో సంచలన కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటూ ఉంటారు.  ఈమె 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు పార్టీ అధికార ప్ర‌తినిధిగా టీడీపీలో యాక్టీవ్ రోల్ పోషించారు సాధినేని యామిని. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మిని చ‌విచూడటంతో, ఆ త‌ర్వాతి కాలంలో బీజేపీలో చేరారు. ఈ కేసు వ్యవహారంపై సాధినేని యామిని స్పందించాల్సి ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News