కాపుల యాత్రపై కనీవినీ ఎరుగని ఆంక్షలు

Update: 2017-01-24 07:24 GMT
 కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి సత్యాగ్రహం చేపడతాన్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున ఆంక్షలు విధించింది.  యాత్రను కవర్ చేయకుండా మీడియాపై ఆంక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఇంటర్నెట్ సర్వీసులు ఆపడం వంటి అసాధారణ చర్యలు తీసుకుంటోంది.
    
యాత్రకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు… మీడియాపైనా ఆంక్షలు విధించారు. కాపు సత్యాగ్రహ యాత్రను ప్రత్యక్షప్రసారం చేయవద్దని మీడియాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు కోనసీమ - కిర్లంపూడిలో ఇంటర్‌ నెట్ సేవను నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
    
మరోవైపు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పోలీసులను మోహరించారు. కాపు నేతల కదలికపై నిఘా ఉంచారు. వీధుల్లో కవాతు నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుంచి రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రప్పించారు.  జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రను అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రతిసారీ జరుగుతన్నట్లుగానే ముద్రగడను ముందుగానే అరెస్టు చేస్తారని.. యాత్రను అడ్డుకుంటారని తెలుస్తోంది. యాత్ర సాగుతుందా లేదా అన్నది పక్కన పెడితే గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ యాత్ర కోసం కాపు వర్గం తరలుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News