పేల్లేదు.. లీకై నలుగురు చనిపోయారు

Update: 2015-11-04 07:47 GMT
వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన కోడలు.. ముగ్గురు మనమలు మరణించటం తెలిసిందే. అత్తమామలకు.. కోడలికి మధ్యనున్న తగాదాల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవటం పలు సందేహాలకు తావిస్తోంది. ఇక.. సారిక ఉన్న గదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ గ్యాస్ సిలిండర్లను అధికారులు పరిక్షించారు. ఇక.. మరణించిన మృతదేహాల్ని శాస్త్రీయంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రాధమిక సమాచారం ప్రకారం.. రాజయ్య కోడలు ఉన్న బెడ్ రూంలో రెండు సిలిండర్లు ఉన్నాయని.. అవి పేలలేదు కానీ లీకై అగ్నిప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లు ఎలా లీకయ్యాయన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలు పూర్తిగా కాలిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గ్యాస్ ఏ విధంగా లీకైందన్నది ఇప్పుడు ప్రధానంగా మారింది. దీనిపై ఒక స్పష్టత వస్తే.. ఈ ఘటన ఎలా జరిగిందన్నది తేలుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News