కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ గానే కాకుండా ఎక్స్ ప్రెస్ టీవీతో మీడియా రంగంలోకి ప్రవేశించిన ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. గత నెల 31న హైదరాబాదులో జయరాంను హత్య చేసిన రాకేశ్ రెడ్డి... ఆయన డెడ్ బాడీని కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం పరిధిలో జాతీయ రహదారి పక్కగా కారులో వదిలేసి వెళ్లిపోయాడు. హత్యకు యాక్సిడెంటల్ డెత్ గా చిత్రీకరించేందుకే నిందితుడు ఈ పని చేసినట్టుగా ఇప్పటికే తేలిపోయింది. ఏపీ పోలీసుల దర్యాప్తులో ఈ కేసును అప్పటికప్పుడు మూసేసే యత్నం జరగ్గా.. జయరాం సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. ఈ క్రమంలో ఈ మర్డర్ మిస్టరీ... మిస్టరీలకే మిస్టరీగా మారిపోయిందని చెప్పాలి.
సొంత మేనకోడలు శిఖా చౌదరి ఈ హత్యలో కీలక పాత్ర పోషించదన్న వార్తలు - ఆ తర్వాత ఆమె డేటింగ్ చేసిన రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడని తేలింది. ఈ నేపథ్యంలో రాకేశ్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న హైదరాబాదు పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మర్డర్ మిస్టరీలో ఉన్న మరిన్ని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. జయరాంకు ఉన్న వుమనైజింగ్ నే అస్త్రంగా మలచుకున్న రాకేశ్ రెడ్డి... జయరాంపై హనీట్రాప్ వలను విసిరారు. ఈ హనీ ట్రాప్ లో రాకేశ్ రెడ్డికి తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సూర్య అనే జూనియర్ ఆర్టిస్ట్ కూడా సహకారం అందించాడన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. రాకేశ్ రెడ్డి ఇంటికి జయరాంను తీసుకెళ్లడంలో సూర్యనే కీలక భూమిక పోషించారట.
గత నెల 29న జయరాంకు ఫోన్ చేసిన సూర్య... తన వద్ద ఓ అందమైన అమ్మాయి ఉందని చెప్పాడట. ఈ విషయాలపై అమితాసక్తి కలిగిన జయరాం ఆ మరునాడు సూర్యకు ఫోన్ చేయగా... అతడు జయరాంను నేరుగా రాకేశ్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్దారించినట్లుగా సమాచారం. మొత్తంగా వందల కోట్లకు అధిపతిగా ఉన్న జయరాం.. కేవలం నిందితులు విసిరిన హనీట్రాప్ ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటిదాకా రాకేశ్ కు సహకరించిన పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సూర్యను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ కేసులో ఇంకెన్ని మలుపులు వెలుగు చూస్తాయో చూడాలి.