వైరల్: రోడ్డెక్కిన పోకిరీలకు పోలీసుల 'కరోనా' శిక్ష

Update: 2020-04-24 10:30 GMT
కరోనా వైరస్ కు మందు లేదు. అందుకే జనాల ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. కానీ కొందరు ఆకతాయి యువకులు ఇవేవీ పట్టించుకోకుండా రోడ్డెక్కుతున్నారు. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో వారికి తగిన బుద్ది చెప్పేలా తమిళనాడు పోలీసులు సరికొత్త ఆలోచన చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది.

తాజాగా లాక్ డౌన్ సమయంలో ముగ్గురు యువకులు తమిళనాడులో ఒకే బైక్ పై మాస్కులు లేకుండా రోడ్డుమీదకు వచ్చారు. వారికి తగిన బుద్ది చెప్పేందుకు పోలీసులు కరోనా వైరస్ రోగులను తరలించిన అంబులెన్స్ లోకి వారిని ఎక్కించారు. దీంతో ఆ యువకులు ప్రాణభయంతో గింజుకున్న తీరు నవ్వులు పూయించింది. 21 రోజులు మిమ్మల్ని క్వారంటైన్ కు తరలిస్తున్నామని.. ఆ తర్వాతే వదిలిపెడుతామని పోలీసులు నాటకమాడి ఓ అంబులెన్స్ లోకి వాళ్లని బలవంతంగా జొప్పించారు. అందులో కరోనా పేషెంట్ లాగా ఒక డమ్మీ రోగిని కూర్చుండబెట్టారు పోలీసులు. దీంతో తెగ కంగారు పడిన యువకులు అంబులెన్స్ కిటీకీలోంచి బయటకు దూకేందుకు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నానా యాతన పడ్డారు. ఇదంతా వీడియో తీసి పోలీసులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. నవ్వులు పూయిస్తోంది.

నిజానికి రోడ్డుక్కిన వారిని భయపెట్టేందుకు పోలీసులు ఆడిన నాటకమిదీ. కానీ యువకులు నిజంగానే కరోనా అంబులెన్స్ .. అందులో కరోనా రోగి ఉన్నాడనుకొని కంగారు పడి గింజుకున్నారు.

పోలీసులు ఇలా పోకిరీలకు బుద్దిచెప్పిన వైనంపై పలువురి నుంచి ప్రశంసలు కురిశాయి. ఇలా చేస్తే కానీ కొందరికి బుద్ది రాదని అభినందించారు. ఇక పోలీసుల వీడియో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన హీరో మంచు విష్ణు మీ తెలివైన ఆలోచనకి నా అభినందనలు అంటూ పోలీసులను కొనియాడారు.


Full View

Tags:    

Similar News