తెలుగుదేశం పార్టీ, యువ నేత పరిటాల శ్రీరామ్‌కు అనంతపురం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీరామ్ పై బత్తలపల్లి, రామగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు.. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రామగిరి వెళ్లిన సమయంలో చేసిన ప్రసంగంపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.
గత ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో స్వాగత ద్వారంపై ఉన్న పరిటాల రవి పేరును జేసీబీ సాయంతో తొలగించే ప్రయత్నం చేశారట. వెంటనే సమాచారం అందుకున్న పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రి సునీతలు అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నాయకుల విగ్రహాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల శిలా ఫలకాలు, ఆర్చిలకు ముసుగులు వేయాలి లేకపోతే వాటిని కప్పి ఉంచాలనే నిబంధన ఉందని.. కానీ రామగిరి ఎంపీడీవో ఏకంగా స్వాగత ద్వారంపై ఉన్న పేరును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌లు స్పందించారు. పరిటాల శ్రీరామ్‌పై మండిపడ్డారు. శ్రీరామ్ ప్రజలను రెచ్చగోడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మాత్రం సహించేది లేదన్నారు. రాప్తాడులో గెలవలేకే ప్రత్యర్ధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
ఇకపోతే , గత కొన్ని రోజుల క్రితం పరిటాల శ్రీరామ్ కుటుంబం టీడీపీకి రాజీనామా చేయబోతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారంపై పరిటాల శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన శ్రీరామ్.. టీడీపీని వీడే ప్రసక్తే లేదని .టీడీపీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్బ్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ నిత్య ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం.. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు , జీవితంలో రాజకీయాలకి దూరంగా అయిన ఉంటాము కానీ , టీడీపీని వీడి మరో పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు అని తెలిపారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, కార్యకర్తలకు అండగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అని తెలిపాడు.