గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారం అనూహ్య రీతిలో మరోసారి వెలుగులోకి వచ్చాయి. తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా రాజకీయ నేతలు - అధికారులతో నయీం దోస్తీ సాగించిన సంగతి తెలిసిందే. అయితే నయీంతో ప్రజాప్రతినిధులు - రాజకీయ నేతలు - పోలీసులకు సంబంధాలు లేవని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. అయితే తాజాగా కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. తాజాగా నయీం దందాకు సహకరించిన పోలీసుల వ్యవహారాలు బట్టబయలు చేస్తున్న కొన్ని ఫోటోలు వెలుగు చూశాయి. పలువురు ఏసీపీలు - అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు నయీంతో విందు వినోదాలు చేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. నయీంతో చర్చలు జరుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఫోటోలు బయటికి రావటంతో వారిపై చర్యలు తీసుకునేందుకు సిట్ రెడీ అయినట్లు సమాచారం.
నయీంతో పోలీస్ అధికారులకు సంబంధాలు ఉన్నాయనడానికి, సిట్ కూడా సంపాదించలేని ఆధారాలు ఇప్పుడు దొరికాయి. హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్ లో గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పోలీస్ బాస్ లు ఎంజాయ్ చేశారు. అదనపు ఎస్పీ స్థాయినుంచి ఎస్సై స్థాయి వరకు విందులు - చిందులతో హంగామా చేసిన ఫోటోలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్ మెంట్ లో మొత్తం 16మంది ఉన్నతాధికారులతో నయీంకు దగ్గరి సంబంధాలున్నట్లు సిట్ గుర్తించింది. అయితే వీరు నయీంతో కలసి సెటిల్‌మెంట్లు చేశారా? లావాదేవీలకు పాల్పడ్డరా అనేది మాత్రం తేల్చలేదు. గ్యాంగ్ స్టర్ తో అంటకాగిన పోలీస్ బాస్ ల అందరిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈమధ్య కాలంలో పోలీస్ బాస్ లు పొందిన పోస్టింగులతో పాటుగా వారి ఆస్తుల వివరాలపై సిట్ అంతర్గతంగా విచారణ చేస్తోందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/