హత్యకేసులో చిక్కుకున్న మాజీ టీడీపీ నేత

Update: 2019-05-02 06:13 GMT
టీడీపీ మాజీ నేత బీఎన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో బీఎన్ రెడ్డి సన్నిహిత సంబంధాలు నెరిపారు. జయరాంతో సెటిల్ మెంట్ చేసుకునేందుకు రాకేష్ రెడ్డి నివాసానికి బీఎన్ రెడ్డి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే బీఎన్ రెడ్డిపై చార్జిషీట్ లో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే బీఎన్ రెడ్డికి జూబ్లిహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

చార్జిషీట్ లో బీఎన్ రెడ్డి పేరును చేర్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు బీఎన్ రెడ్డిని విచారించిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

జయరాం హత్యకు ముందు రాకేష్ రెడ్డితో సెటిల్ మెంట్ చేసుకోవాల్సిందిగా జయరాంపై బీఎన్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. హత్యకు కొద్దిరోజుల ముందు రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు రాకేష్ రెడ్డిని తీసుకెళ్లాడు. ఈ ఆరోపణలు రుజువు కావడంతోనే టీడీపీకి మచ్చ పడకూడదని భావించి బీఎన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అరెస్ట్ ముంగిట నిలిచారు. మొత్తంగా సెటిల్ మెంట్ వ్యవహారం బీఎన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. .
   

Tags:    

Similar News