నేరగాళ్లపై హ్యాక్ 'ఐ'

Update: 2015-09-27 10:01 GMT
 మహిళల రక్షణకు హైదరాబాద్ పోలీసులు రూపొందించిన యాప్ ఇప్పుడు హాట్  టాపిక్ అయింది.. అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందికర పరిస్తితులు ఎదుర్కొన్నా చేతిలో మొబైల్ - అందులో ఈ యాప్ ఉంటే చాలు సురక్షితంగా బయటపడొచ్చంటున్నారు. 'హాక్ ఐ' అనే ఈ యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతోంది.

పోలీసు స్టేషన్ లో అడుగుపెట్టకుండా... ఫిర్యాదు ఇచ్చింది ఎవరన్నది బయటపెట్టకుండా ఉండేలా ఈ యాప్ సహాయంతో ఎక్కడినుంచైనా నిమిషాల్లో పోలీస్ కంప్లయింటు ఇవ్వొచ్చు. వేధింపులు - రాగింగ్ - మహిళలపై నేరాలే కాకుండా ట్రాఫిక్ ఉల్లంఘనలు - పోలీసుల దురుసుతనం వంటివాటిపైనా ఫిర్యాదు చేయొచ్చు. దీని ద్వారా ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులే మిమ్మల్ని సంప్రదిస్తారు. నేరం జరిగితే దానికి సంబంధించిన ఫొటో అందులో అప్ లోడ్ చేస్తే చాలు మిగతాది పోలీసులు చూసుకుంటారు.

ఈ యాప్ లో హైదరాబాద్ లోని అన్ని పోలీసు స్టేషన్ ల కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి. ఏదైనా ఆపదలో చిక్కుకుంటే సమీపంలో స్టేషన్ కు వెంటనే ఫోన్ చేసుకోవచ్చు. స్టేషన్ లవే కాకుండా పెట్రోలింగ్ వాహనాలను సంప్రదించాల్సిన నంబర్ లూ ఇందులో ఉన్నాయి.

....అయితే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారెప్పుడు రావాలి అనుకోవద్దు.. దీనిద్వారా ఫిర్యాదు చేశాక వెంటనే స్పందించాల్సిందే. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టేటస్ మనకు వస్తుంది.  మహిళలకు దీంతో ప్రయోజనముంది. క్యాబ్ లు - ఆటోల్లో వెళ్లేటప్పుడు దాని ఫొటో - నంబర్ ఈ యాప్ లో అప్ లోడ్ చేస్తే మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు అందివ్వొచ్చు.

ఇన్ని సౌకర్యాలు - రక్షణాంశాలు ఉన్న హ్యాక్ ఐను డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే. గూగుల్ ప్లే స్టోర్ లో ఇది ఉచితంగా దొరుకుతోంది.
Tags:    

Similar News