సామర్థ్యం 5వేలు.. పోలీసులు 200లేనా?

Update: 2016-08-27 07:55 GMT
మరికొద్ది గంటల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ తిరుపతిలో జరగనుంది. ఊహించని విధంగా కేవలం రోజు వ్యవధిలో (ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే 20 గంటల సమయంలోనే) ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అనుకోవటం.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చకచకా చేస్తుండట తెలిసిందు. ఇంత హటాత్తుగా పవన్ సభ పెట్టాలని ఎందుకున్నారన్న విషయం మీద ఎవరూ సరైన కారణం చెప్పలేకపోతున్నారు. హోదా మీద మాట్లాడతారన్న మాట చెబుతున్నా.. ఎప్పటి నుంచో ఉన్న విషయానికి ఇంత ఆకస్మాత్తుగా సభ పెట్టాల్సిన అవసరం ఉందా? అన్నది ఒక ప్రశ్న.

ఇదిలా ఉంటే.. సభను ఏర్పాటు చేస్తున్న తుడా ఇందిరా మైదానం పవన్ అభిమానుల్ని తట్టుకునే శక్తి ఉందా? అన్నది ప్రశ్నగా మారుతోంది. ఎందుకంటే.. ఈ మైదానం సామర్థ్యం కేవలం నాలుగు వేల నుంచి ఐదు వేల మంది మాత్రమే. తిరుపతి.. ఆ చుట్టుపక్కలున్న పవన్ అభిమానులు వచ్చినా పదివేలకు పైనే ఉంటుంది. ఆ లెక్కన పవన్ లాంటి వ్యక్తి బహిరంగ సభకు పిలుపునివ్వటం అంటే ఆయన అభిమానులు వేలల్లో చేరుకునే వీలుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి అభిమానులు వచ్చినా కనిష్ఠంగా 50వేలు.. గరిష్ఠంగా లక్షకు చేరే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. తొక్కిసలాటకు అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐదు వేల మంది సామర్థ్యం ఉన్న సభకు కేవలం 200 మంది పోలీసుల్ని నియమించటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కున్న ఇమేజ్ దృష్ట్యా సభ విషయంలో మరిన్ని జాగ్రత్తల్ని యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News