ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇటీవల అన్న క్యాంటీన్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందు అలాంటి ఘటనే గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.
తెనాలి మార్కెట్ సెంటర్ లో అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద టీడీపీ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఇది సెంటర్‌లో ఉందని.. ట్రాఫిక్ వస్తుందని మున్సిపల్ అధికారులు అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను, కూర గిన్నెల ఉన్న ఆటోను అక్కడి నుంచి పోలీసులు తీసుకుపోయారు.
దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌ను అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ తాము కూడా అన్నదానం చేస్తామంటూ టీడీపీ అన్న క్యాంటీన్ ఎదురుగా క్యాంటీన్ తెరిచింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్ సెంటర్‌లో పోలీసులు షాపులు మూయించారు. తెనాలి మార్కెట్ సెంటర్‌కు వెళ్లే అన్ని మార్గాలు మూసివేశారు. మరోవైపు మార్కెట్ సెంటర్‌కు భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. టీడీపీ - వైఎస్సార్సీపీ వర్గీయుల మోహరింపుతో ఆంధ్రా పారిస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా తెనాలిలో పోలీసులు పక్షపాతం చూపారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు కావాలనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతలతో అన్నదానం ఏర్పాటు చేయించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అన్నదానం దగ్గర కంటే టీడీపీ అన్న క్యాంటీన్ దగ్గరే ఎక్కువ మంది తింటుండటంతో ఆహార పదార్థాలను, కూరలు ఉన్న గిన్నెలను లాక్కెళ్లి వెళ్లారని ధ్వజమెత్తారు.
అంతేకాకుండా అన్నదానం చేస్తున్న తమపై పోలీసులు దాడి చేశారని టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో టీడీపీ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందిగామ, మంగళగిరి, కుప్పంల్లో అన్న క్యాంటీన్లకు అడ్డుపడ్డారని... ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డిలో మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు. తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని సృష్టించేలా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.