స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కు షాకిచ్చిన పోలీసులు

Update: 2022-04-04 06:28 GMT
స్టార్ డైరెక్ట‌ర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కు జూబ్లీహిల్స్ పోలీసులు షాకిచ్చారు. ఆయ‌న వెళుతున్న కార్ ని స‌డ‌న్ గా ఆపి ఫైన్ వేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల గ‌త కొన్ని రోజులుగా న‌గ‌రంలో కొత్త రూల్స్ ని అమ‌ల్లోకి తీసుకొచ్చారు. బైక్ ల‌పై కానీ , ఫోర్ వీల‌ర్స్ పై కానీ ఎలాంటి స్టిక్క‌ర్స్ వున్నా జ‌రిమానాలు విధిస్తున్నారు. అంతే కాకుండా కారు డోర్ ల అద్దాల‌కు ప్ర‌త్యేకంగా అమ‌ర్చిన బ్లాక్ ఫిల్మ్‌ని తొల‌గిస్తూ ఫైన్ లు వేస్తున్నారు.

అయితే ఈ విష‌యంలో వీఐపీల‌ని సైతం హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వ‌ద‌ల‌డం లేదు. వీఐపీలు అయినా స‌రే నిబంధ‌నల‌కు విరుద్ధంగా వుంటే కొర‌టా ఝుళిపిస్తున్నారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ స‌డ‌న్ గా వీఐపీల కార్ల‌ని ఆపేస్తూ ఫైన్ లు వేస్తుండ‌టం నిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురి కార్ల‌ని ప‌రిశీలించి కార్ల డోర్ ల‌కు అమ‌ర్చిన‌ బ్లాక్ ఫిల్మ్‌ని తొల‌గించ‌డ‌మే కాకుండా జ‌రిమానా విధించారు.

హీరో మంచు మ‌నోజ్ కార్ ని ఆపి బ్లాక్ ఫిల్మ్ ని తొల‌గించ‌డ‌మే కాకుండా ఆయ‌న‌కు జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కూడా అడ్డంగా బుక్క‌య్యారు. సోమ‌వారం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద కార్ లో ప్ర‌యాణిస్తున్న త్రివిక్ర‌మ్ కు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు.

ఆయ‌న‌ కార్ ని అర్థాంత‌రంగా ఆపిన పోలీసులు ఆయ‌న కార్ కు అమ‌ర్చిన బ్లాక్ ఫిల్మ్ ని తొల‌గించి  రూ. 700 జ‌రిమానా విధించారు.  ఈ స‌మ‌యంలో కార్ లో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఉండ‌టం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన ఫొలోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి.

త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో భారీ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిపిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌బోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

త్వ‌ర‌లోనే ఈ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. మ‌హేష్ ప్ర‌స్తుతం 'స‌ర్కారు వారి పాట‌' చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ త‌న సినిమాని సెట్స్ పైకి తీసుకోళ్ల‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News