జ‌గ‌న్ కార‌ణంగా ఏపీలో పోలీస్ స్టేష‌న్లు మారిపోనున్నాయ్

Update: 2019-06-25 09:50 GMT
పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాల్ని వేగంగా తీసుకుంటూ.. దూకుడుగా దూసుకెళుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఏపీలోని పోలీస్ స్టేష‌న్ల‌పై త‌న మార్క్ వేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఐపీఎస్ ల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న పోలీస్ స్టేష‌న్ల‌లో చేయాల్సిన మార్పుల గురించి ప్ర‌స్తావించారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ అందించాల‌ని నిర్ణ‌యించిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. వారంలో ఒక రోజు సెల‌వు తీసుకుంటే.. మిగిలిన రోజుల్లో ఉత్సాహంగా ప‌ని చేయ‌గ‌లుగుతార‌న్నారు. పోలీస్ స్టేష‌న్ల‌లో రిసెప్ష‌న్ విభాగాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు.

కంప్లైంట్ చేసే వారిని గౌర‌వించేలా రిసెప్ష‌న్ రూపురేఖ‌లు మార్చాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. పోలీస్ శాఖ‌లో కొత్త నియ‌మ‌కాలు చేప‌డ‌తామ‌న్న ఆయ‌న‌.. ద‌ళిత‌.. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు మ‌రింత చేరువ అయ్యేలా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. జిల్లా ఎస్పీలు ఆక‌స్మిక త‌నిఖీలు చేప్ట‌టాల‌న్న ఆయ‌న‌.. ఎస్ ఐలు.. బ‌డుగు.. బ‌ల‌హీన వ‌ర్గాల వారి వ‌ద్ద‌కు వెళ్లి స్థానికంగా ఉండే ఎస్ఐ.. సీఐ ప‌నితీరు గురించి ఆరా తీయాల‌న్నారు.

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాల‌ని నాన్న నేర్పించార‌ని.. తాను కూడా అదే సిద్ధాంతాన్ని న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు. పాల‌న‌కు సంబంధించి తీసుకునే మంచి నిర్ణ‌యాల‌కు త‌న స‌హ‌కారం పూర్తిగా ఉంటుంద‌న్న జ‌గ‌న్‌.. ఎస్పీలు వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించాల‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా జ‌రిగితే ఏపీలో పోలీస్ స్టేష‌న్ల రూపురేఖ‌లు మారిపోవ‌ట‌మే కాదు.. పోలీసింగ్ లోనూ కొత్త విధానాలు తెర మీద‌కు వ‌స్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News