కాల్ మనీ కంపెనీల ఆటకట్టైంది. ప్రజలకు ఆన్ లైన్ యాప్ ల ద్వారా అప్పులు ఇచ్చి వారిని పీడించి చావులకు కారణం అవుతున్న సంస్థలపై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్ లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సైబర్ క్రైం పోలీసులు కొరఢా ఝలిపించారు. లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.
తాజాగా సైబర్ క్రైం పోలీసులు సైబరాబాద్ లో నలుగురిని.. హైదరాబాద్ లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
లోన్ యాప్ కేసులో 11 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడారు. సైబర్ క్రైమ్‌లో 16 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. లోన్ యాప్‌లకు ఆర్‌బీఐ నుంచి అనుమతి లేదన్నారు. హైదరాబాద్ కాల్ సెంటర్‌లో 600 మంది.. గుర్గావ్‌లో 500 మంది టెలికాలర్స్ పనిచేస్తున్నారని వెల్లడించారు. బిందురాణి, మాలిక్, మధుబాబు, తరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 700 ల్యాప్‌టాప్స్, సర్వర్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్, ఢిల్లీలోని కాల్ సెంటర్లకు ఇండోనేషియా, చైనాతో లింక్ ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని గురుగ్రాం సమీపంలో 16 యాప్ లకు సంబంధించిన 10 కాల్ సెంటర్లపై దాడులు చేయగా.. అక్కడ 400 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ కాల్ సెంటర్ ప్రతినిధులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న కాల్ సెంటర్లపై దాడులు చేశారు. హైదరాబాద్ కాల్ సెంటర్లలో 700 మంది టెలీకాలర్లుగా పనిచేస్తున్న గుర్తించారు. జీతంతోపాటు అదనంగా 10వేల నుంచి 20వేల రూపాయల వరకు ఇన్సెంటీవ్ లు అందిస్తున్న అంశం పోలీసు విచారణలో వెలుగుచూసింది.