ఏళ్ల తరబడి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉండటంతో వాటిని వసూలు చేసుకొనేందుకు ముంబై పోలీసులు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. నేరుగా పెండింగ్ ఉన్నవాళ్ల ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేయనున్నారు. ముంబైలో ట్రాఫిక్ చలాన్లు భారీగా పేరుకుపోయాయి. దాదాపు రూ. 317 కోట్లు బకాయిలు ఉన్నట్టు సమాచారం. దీంతో పెండింగ్ బకాయిలు ఎలాగైనా వసూలు చేయాలని పోలీసులు చూస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు హోంశాఖ అనుమతి కోసం లేఖ రాశారు.
మొత్తం 11 బృందాలు చలాన్ల వసూలుకు వెళ్లనున్నాయి. ముంబైలో నాలుగేళ్ల క్రితం నుంచి ఈ చలాన్లు విధిస్తున్నారు.కానీ వాహనదారులు మాత్రం డబ్బులు చెల్లిండం చేదు దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడ్డారు. వాళ్లు చలాన్లు చెల్లించని వాళ్ల ఇంటికి వెళతారు. వాళ్లతో మాట్లాడి డబ్బులు వసూలు చేసుకుంటారు. వాళ్లు డబ్బులు కడితే వెంటనే రశీదు కూడా ఇస్తారు.
అయితే ఈ లోపే వాహనదారులు చలాన్లు చెల్లిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. కనీసం ఈ చర్యలతోనైనా బకాయిల పెండింగ్ తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే పోలీసులకు ఇళ్లకు వెళ్లేందుకు ఇంకా హోంశాఖ అనుమతి రాలేదని.. హోంశాఖ అనుమతి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.