ఏపీలోని విశాఖపట్నంలో దళితుడికి శిరోముండనం చేసిన సంఘటన సంచలమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బిగ్ బాస్ సెలెబ్రెటీ, దర్శకుడు నూతన్ నాయుడును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు బయటపడ్డప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడిని పోలీసులు చాకచక్యంగా కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్ కుమార్ తెలిపారు.
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేల్చిన పోలీసులు అతడికోసం వెతికి తాజాగా అరెస్ట్ చేశారు.
సినీ నిర్మాత నూతన్ నాయుడు భార్య నర్సింగి ప్రియమాధురి ఈ ఘాతుకానికి కేంద్ర బిందువు అని తేల్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ (19)కు ఆమె గుండు కొట్టించారు. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా తన భార్య మధుప్రియను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్ చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. భార్యతోనూ మాట్లాడినట్టు గుర్తించారు. అందుకే తాజాగా అరెస్ట్ చేశారు.