దుర్గం చెరువు బ్రిడ్జిపై పోకిరీలు చేసిన పని తెలిస్తే షాకవుతారు

Update: 2020-10-08 16:40 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు కొంతకాలంగా పర్యాటక ప్రదేశాలకు, విహార యాత్రలకు ప్రజలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంతమంది ఔత్సాహికులు జాగ్రత్తలు పాటిస్తూ పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రూ.180 కోట్ల వ్యయంతో ప్రతిష్మాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు నగరవాసులు బారులుతీరుతున్నారు. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని వీక్షించేందుకు జంటనగరాల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఇక, ఈ బ్రిడ్జికి విద్యుత్ కాంతులతో అదనపు హంగులు అద్దడంతో రాత్రిపూట జిగేల్ మంటూ మెరిసిపోతోంది. ఈ క్రమంలోనే అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో కేవలం ఆదివారం రోజు మాత్రమే సందర్శకులను అనుమతిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది నగరవాసులు నిబంధనలు అతిక్రమించి రోడ్డు దాటడం....సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది పోకిరీలు అర్థరాత్రి పూట ఈ బ్రిడ్జిప పై వికృత చేష్టలకు పాల్పడ్డారు. సెల్ఫీ పిచ్చతో నగ్నంగా సెల్ఫీలు దిగుతూ నిఘా కెమెరాలకు చిక్కారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్ ను పోలీసులు నియంత్రించగలిగారు కానీ, పోకిరీల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా...కొందరు పోకిరీలు అర్ధరాత్రి మద్యం సేవించి రచ్చ చేస్తున్నారు. ఓ వైపు బ్రిడ్జిపై సెల్ఫీలు వద్దంటున్న వినకపోవడంతో కొందరిపై కేసులు కూడా పెట్టారు పోలీసులు. ఇక, తాజాగా అర్థరాత్రి బ్రిడ్జిపై బట్టలు విప్పేసి నడిరోడ్డుపై పడుకొని మరీ సెల్ఫీలు దిగారు కొందరు ప్రబుద్ధులు. అయితే, సర్వేలైన్స్ లో ఈ పోకిరీల ఆగడాలను చూసిన మాదాపూర్‌ పోలీసులు.. వెంటనే స్పందించారు. పబ్లిక్ ప్లేసులో ఈ వికృత చేష్టలకు పాల్పడ్డ ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
Tags:    

Similar News