వార‌స‌త్వ రాజ‌కీయంపై మండ‌లి బెంగ..‌!

Update: 2021-03-15 00:30 GMT
నేటి త‌రం రాజ‌కీయాలు అంటే.. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులు.. అనంత‌రం వారి వార‌సులు.. ఇలా త‌ర‌త‌రాలుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని కోరుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వార‌సులుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న వారిలో కొంద‌రు స‌క్సెస్ అవుతుండ‌గా మరికొంద‌రు మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితి కీల‌క నేత‌ల‌ను వేధిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్పుడు కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను చూసుకుంటే... ఇక్క‌డ ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేసిన‌.. కేంద్రంలో ప‌ద‌వులు సైతం అనుభ‌వించిన నాయ‌కులుగా గుర్తింపు పొందిన మండ‌లి వెంక‌ట కృష్ణారావు కుటుంబంలో ఇప్పుడు రాజ‌కీయ బెంగ ప‌ట్టుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

కృష్ణా జిల్లాలో మండ‌లి కుటుంబానికి సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. మండ‌లి వెంక‌ట కృష్ణారావుతో ప్రారంభ‌మైన రాజ‌కీయ ప్ర‌స్థానం.. ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. వెంక‌ట కృష్ణారావు రాజ‌కీయంగా ఎంతో కృషి చేశారు. పేద‌ల‌కు దేవుడుగా ఆయ‌న పేరు ఇప్ప‌టికీ నిలిచిపోయింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన చ‌ల్ల‌ప‌ల్లి రాజాను ఢీకొట్టి... రాజ‌కీయంగా త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకు న్నారు. ఈ క్ర‌మంలోనే వివాద‌ర‌హితుడిగా.. అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా.. అప్ప‌టి కాంగ్రెస్‌లో ఆయ‌న గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ్ఞాప‌కార్థం.. కృష్ణా-గుంటూరు జిల్లాల‌ను క‌లిపే వార‌ధికి మండ‌లి వెంక‌ట ‌కృష్ణారావు వార‌ధి అని పేరు పెట్టారు.

ఇక‌, రాజ‌కీయంగా మండ‌లి వార‌సుడు... బుద్ధ ప్ర‌సాద్‌.. కూడా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టారు. కాంగ్రెస్ త‌ర‌ఫున సుధీర్ఘ‌కాలం రాజ‌కీయం చేసిన ఆయ‌న వైఎస్ జ‌మానాలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలో చేరిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించి డిప్యూటీ స్పీక‌ర్ ప‌దవిని సైతం అలంక‌రించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ...ఆయ‌న వారసుడు.. మండ‌లి వెంక‌ట్రామ్‌.. ఏమేర‌కు ఈ కుటుంబం రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తార‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో.. ఒకింత ఇమ‌డ‌లేక పోతున్నార‌నే వాద‌న మండ‌లి కుటుంబం గురించి వినిపిస్తోంది. రాజ‌కీయంగా సంచ‌ల‌న కామెంట్లు, దూకుడు, విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం వంటివాటికి ఈ కుటుంబం వ్య‌తిరేకం కావ‌డంతో .. ఆయ‌న వార‌సుడిగా.. వెంక‌ట్రామ్‌.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతార‌న్న‌ది సందేహంగా మారింది. అదే స‌మ‌యంలో.. మండ‌లి వెంక‌ట్రామ్‌ స‌త్తాపై దివిసీమ వాసుల‌కు కూడా ప‌లు సందేహాలు ఉన్నాయనేది వాస్త‌వం. మండ‌లి వార‌సుడికి దూకుడు, చొచ్చుకుపోయే స్వ‌భావం కూడా లేక‌పోవడం మైన‌స్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల వేళ వెంక‌ట్రామ్ రంగంలో ఉన్నా ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాడా ? అన్న ఆందోళ‌న తండ్రిగా బుద్ధ ప్ర‌సాద్‌కే ఉందని టాక్ ?



Tags:    

Similar News