నూతన సంవత్సరంలో నేతల మనసు?

Update: 2016-04-08 13:53 GMT
    ఉగాది రోజున ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో తమ మంచి జరగాలని.. అన్నీ శుభప్రదంగా సాగాలని అందరూ కోరుకుంటూరు. సాధారణ ప్రజలైనా - ప్రముఖులైనా - పాలకులైనా - నేతలయినా... ఎవరైనా సరే తాము కోరుకున్నది జరగాలనే అనుకుంటారు. అసలు కోరికలు లేనిదెవరికి? ఈ నేపథ్యంలో నేతల మనసులో కోరికలేంటో ఓసారి చూద్దామా?

చంద్రన్న... ఉగాది ఆశలు..

సంక్రాంతికి అందరికీ చంద్రన్న కానుకలు ఇచ్చి సంతోష పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఉగాదికి మాత్రం తన ఆశలన్నీ తీరాలని దేవుళ్లను వేడుకుంటూ తీరినంతగా సంతోషపడుతున్నారు. కొత్త సంవత్సరంపై ఆయన కోటి ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రం కోసం... తన వారసుడి కోసం ఆయన తెగ ఆశపడుతున్నారు. ఈ ఏడాదైనా కేంద్రం నుంచి బాగా సాయం అందాలని... అంతకుముందులా మోడీ తమను లైట్ గా తీసుకోకుండా బాగా ప్రయారిటీ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచమంతా తనను అహో ఒహో అంటున్నా కూడా మోడీ మాత్రం తనను తేలిగ్గా తీసిపారేస్తూ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని చంద్రబాబు చాలాకాలంగా ఫీలువుతన్నారు. ఈ ఏడాది ఆ పరిస్థితి మారాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు.  అలాగే అబ్బాయి లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకునే ప్రక్రియ వివాద రహితంగా సాగి లోకేశ్ స్టాండయిపోవాలని కోరుకుంటున్నారు.

చంద్రబాబు మనసులోని కోరికలు ఇవీ...

- తాను చెప్పిందంతా మోడీ వినాలి.  అడిగినదానికి అడిగినంత నిధులివ్వాలి. తనకు నచ్చని బీజేపీ నేతలకు రాష్ట్రంలో పదవులు ఇవ్వరాదు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి. మోడీ బాధ తప్పిపోవాలి.
- వైసీపీ ఎమ్మెల్యేలు అందరినీ టీడీపీలోకి లాగేయాలి.  జగన్ కూడా టీడీపీలోకి వస్తే అప్పుడు ఆలోచిద్దాం.  కమ్మ, రెడ్డి, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలూ టీడీపీకే మద్దతు పలకాలి.  కొత్తగా వచ్చే నేతల కోసం తాను కోరుకున్నన్ని సీట్లు పెరగాలి.

-  లోకేశ్ కేటీఆర్ ను మించిపోవాలి.
- ఏపీలో ఏక పార్టీ వ్యవస్థ ఏర్పడాలి. కాంగ్రెస్ - వైసీపీ - వామపక్షాలను ఏపీలో ఎన్నికల సంఘం నిషేధించాలి. పోటీ చేయకుండా అడ్డుకోవాలి.
- హైదరాబాద్ లో పోగొట్టుకున్న పవర్ మళ్లీ రావాలి. టీఆరెస్ లో ముసలం వచ్చి ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవాలి. మళ్లీ తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
- అశోకుడు, అలెగ్జాండర్, విక్రమాదిత్యుడు, అక్బర్.... ఇలా గొప్ప చక్రవర్తుల గురించి ఇప్పటికీ చెప్పుకొంటున్నట్లుగా తన కోసం, తాను నిర్మించిన అమరావతి కోసం కోట్ల సంవత్సరాల కూడా చెప్పుకోవాలి. వీలయితే భారతదేశానికి చంద్రబాబుదేశం అని పేరు పెట్టాలి.
- గూగుల్ - మైక్రోసాఫ్టు వంటి ప్రపంచస్థాయి టెక్నాలజీ కంపెనీలన్నీ తన సలహాల కోసం క్యూ కట్టాలి.
 ----------

కేసీఆర్...  ‘మిషన్ ఉగాది’

- కొడుకు కల్వకుంట్ల తారక రామారావు నందమూరి తారకరావులా ఎదగాలి.
- హైదరాబాద్  - ఖమ్మం - వరంగల్లులో గెలిచినట్లుగా ఇకపై టీఆరెస్ ఎక్కడ పోటీ చేసినా గెలవాలి.
- పార్టీలో, ప్రజల్లో అల్లుకుపోతున్న కుమారుడు కేటీఆర్ కు అల్లుడు నుంచి ఎలాంటి ఇబ్బంది రాకూడదు.
- కూతురు కవితమ్మకు కేంద్ర మంత్రి పదవి రావాలి.
-  ఇప్పుడున్నట్లే మీడియా ఎప్పుడూ తొత్తులాగే ఉండాలి.
- టీడీపీలో మిగిలిన ఆ ముగ్గురినీ లాగేయాలి.  కాంగ్రెసోళ్లనూ తీసుకుంటే చంద్రబాబు కలలు కంటున్న ఏక పార్టీ వ్యవస్థలో మనం కూడా ఎదురులేకుండా సాగిపోవచ్చు.
- ఈసారి ఫాంహౌస్ లో పసుపు మంచి ధర పలకాలి.
-----------

జగన్..  ఓదార్పు కావాలి

జగన్ కు గత ఏడాది దుఃఖ నామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరం ఆయనకకు దు:ఖం మిగిలిస్తుందో సంతోషం మిగిలిస్తుందో తెలియదు కానీ, ఆయన మాత్రం చాలా కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కోరికలు ఇలా ఉన్నాయి...
- టీడీపీలో ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరాలి... చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవాలి. మూణ్నెళ్లలో తాను సీఎం అయిపోవాలి.
- టిడిపి- బిజెపి మధ్య గొడవలు రావాలి... మోడీ ప్రభుత్వంలో వైసీపీ చేరాలి. చంద్రబాబుపై సీబీఐ కేసులు పెట్టాలి.
- అమరావతి ప్రజలు చంద్రబాబుపై తిరగబడాలి.
- కనీసం పార్టీలో రోజా - చెవిరెడ్డి - బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అయినా మిగలాలి.
- కష్టాల్లో ఉన్న తనను ఓదార్చే వారు రావాలి
-------------

కేటీఆర్... క్రాఫ్ అదిరిపోవాలి

- నాన్న కేసీఆర్ స్టైళ్లో మార్చుకున్న క్రాఫ్ కలిసిరావాలి.
- గత ఏడాది మాదిరిగానే పట్టిందల్లా బంగారం కావాలి.
- కవిత తొందరగా కేంద్రంలో సెటిలైఫోవాలి. ఫుల్లుగా పని ఉండే మంత్రిత్వ శాఖ ఆమెకు వచ్చి ఢిల్లీ నుంచి మల్లీ హైదరాబాద్ రాకుండా ఉండాలి.
- హరీశ్ నుంచి ఎలాంటి థ్రెట్ ఉండకూడదు.
- పొరపాటున కూడా లోకేశ్ కంటే మనం తగ్గకూడదు.
---------

లోకేశ్... ముద్దపప్పు ముద్ర పోవాలి..

-  బ్యాక్ సీటు డ్రైవింగు నుంచి ఫ్రంట్ సీట్లోకి రావాలి.
- హైదరాబాద్ లో మన పప్పులు ఉడకలేదు. కనీసం ఈసారి ఏపీలోని ఆరు కార్పొరేషన్ ఎన్నికల్లోనయినా నా సత్తా చూపాలి.
- కేటీఆర్ లా స్టార్ డమ్ రావాలి.
- నాన్న దయతో మంత్రి పదవి వస్తోంది. ఇక ‘కుమ్మేయాలి’.
- దేవాన్షును రాజకీయాల్లోకి తేవాలి

----- గరుడ
Tags:    

Similar News