పదవి వీడినా, పాపం వీడదు

Update: 2015-03-20 17:30 GMT
అధికారంలో ఉన్నప్పుడు అందరి ఆమోదంతో తీసుకున్న నిర్ణయాలే అధికారానంతరం వివాదాస్ప దంగా మారుతున్నా యి. పాలకులు, బ్యూరోక్రాట్లును వెంటాడుతున్నాయి. వివాదాస్పద నిర్ణయాలు కొందర్ని జైలు పాల్జేస్తుంటే.. మరికొందర్ని జీవితాంతం.. మరణానంతరం కూడా వెంటాడుతున్నాయి.

    పదేళ్ళ పాటు మన్మోహన్‌ భారత ప్రధానిగా వ్యవహరించారు. అంతకుముందు అనేక పదవుల్లో ఉన్నారు. ఎప్పుడూ ఏ చిన్న ఆరోపణల్ని ఎదుర్కోలేదు. కానీ ప్రస్తుతం ఆయన భారత ప్రజల ముందు బోనెక్కే పరిస్థితి వచ్చింది.  ఆయన దుస్థితి కి ఆయన భార్య కళ్ళనీళ్ళ పర్యంతమౌతున్నారు. సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే బగ్గు వేలంపాటలు జరిగాయి. ఈ పాటల్లో దేశానికి రూ.లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ ధ్రువీకరించింది. దీనిపై అప్పటి యూపీఏ ప్రభు త్వం హయాంలోనే సీబీఐ కేసులు నమోదు చేసింది. దీనంతటికి ప్రధానిగా సింగ్‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో సింగ్‌ పాత్రను నిర్దేశించుకున్న సీబీఐ ఆయనకు ఇటీవల సమన్లు ఇచ్చింది. ఇప్పుడు సీబీఐ ముందు సింగ్‌ వాంగ్మూలం ఇవ్వాలి. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి పరిణామాలు జరి గాయి. కొన్ని నిర్ణయాల్ని తీసుకున్న సమయంలో అవి ప్రజాపయో గంగా అప్పటికప్పుడు దేశ దీర్ఘకాల ప్రయోజనాలకు అవసరమై నవిగా గుర్తింపు పొందుతుంటాయి. కాలక్రమంలో అవే వివాదాస్ప దమవుతున్నాయి.

    రాజీవ్‌ గాంధీ..

    బోఫోర్స్‌ ఒప్పందం రాజీవ్‌ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపింది. ఆయన మరణానంతరం ఈ ఆరోపణలపై విచారణ సాగింది. భార్యా పిల్లల్ని కూడా ఈ ఆరోపణలు వేధించాయి. రెండు దశాబ్దాల తర్వాతగాని ఈ ఆరోపణల నుంచి గాంధీ కుటుంబం బయట పడలేక పోయింది.

    వైఎస్‌ రాజశేఖరరెడ్డి..

    భూముల పంపకంలో వైఎస్‌ మరణానంతరం కూడా అనేక విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఆయన జలయజ్ఞం వివాదాల మయంగా మారింది. ఆయన కుటుంబాన్ని కూడా ఈ వివాదాలు వేదిస్తున్నాయి. జగన్‌ భవితవ్యంపై ప్రభావం చూపుతు న్నాయి.

    జయలలిత.. మధుకోడా..

    దత్తత కుమారుడి పెళ్ళి అట్టహాసంగా చేసిన జయలలిత ఆర్థిక ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్ళచ్చారు. ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అలాగే బగ్గు క్షేత్రాల వేలంలోనే మరోమాజీ ముఖ్యమంత్రి మధుకోడా జైలుపా లయ్యారు.

రాజా... మాయావతి.. యడ్యూరప్ప

    2జి స్పెక్ట్రం వేలం లో అప్పటి కేంద్రమంత్రి రాజా చెరసాల పాలయ్యారు. మరో కేంద్ర మంత్రి దయానిధి మారెన్‌ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యాన వనాల్ని తీర్చిదిద్దిన మాయావతి ఆర్థిక అవినీతిలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇనుప క్షేత్రాల కేటాయింపులో యెడ్యూ రప్ప జైలుకెళ్ళచ్చారు. సాధారణం గా హత్యకేసులను ఎదుర్కొన్న వారికి కూడా కొన్ని మినహా యింపులు ఉంటాయి. వారు మరణిస్తే ఆ కేసుల్ని మూసేస్తారు. కానీ ఆవినీతి ఆరోపణల విషయంలో మాత్రం చట్టాలు ఇంతకంటే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. పాల్పడ్డ వ్యక్తి మరణానంతరం కూడా ఆయన కుటుంబీకులు ఈ వివాదాల్ని మోయాల్సి వస్తోంది.

    ప్రపంచమంతా ఇలాంటి పెద్దోళ్లున్నారు..

    ప్రపంచంలోని పలుదేశాల్లో నేతలూ ఇలాంటి పరిస్థితి తెచ్చకున్నారు. 38ఏళ్ళు లిబియాను పాలించిన గడాఫీ ప్రజాకోర్టులో శిక్ష ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌ రాజ్యాంగ రచయితల్లో ఒకరైన మహ్మద్‌ఉద్‌ పదవీకాలం అనంతరం జైలుపాలయ్యాడు. ఈజిప్ట్‌ పాలకుడు హోస్నీ ముబారక్‌ను జైల్లో వేశారు. యెమెన్‌ అధ్యక్షుడు అబ్ధుల్‌సాలేకు ఇదే పరిస్థితి వచ్చింది. గత మూడేళ్ళ కాలాన్ని పరిశీలిస్తే ట్యునిషియా, జోర్డాన్‌, ఒమన్‌, సోమాలియ, ఇరాక్‌, బెహరాన్‌, లెబనాన్‌, సిరియా, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల్లో పాలకుల నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో ప్రజలు వారిని గద్దెనుంచి దింపేసి దేశం నుంచి వెళ్ళగొట్టారు. ఈపరిస్థితిని చూసి కొందరు పాలకులు, అధికారులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌లో వివాదాస్పదమై మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు. కానీ కొందరు పాలకులు మాత్రం ఇప్పటికీ మొండిగానే ముందుకెళ్తున్నారు.



- గరుడ
Tags:    

Similar News