పీవీ సింధు పతకం సాధించడం గర్వకారణమైన విషయమే సందేహం లేదు. అందకు అభినందనలు అవసరమే .. తిరుగులేదు. కోట్ల రూపా1యలు ఇచ్చినా తప్పులేదు. అయితే ఆమె పతకం సాధించిన తర్వాత... కోట్లు ఇవ్వడానికి సిద్ధ పడ్డ ప్రభుత్వాలు.. తమ తమ రాష్ట్రాల్లో అసలు క్రీడలు ఏరకంగా వర్ధిల్లడం గురించి శ్రద్ధ పెడుతున్నాయి. పాఠశాలల్లో క్రీడల నిర్వహణ - టోర్నమెంటుల నిర్వహణ తద్వారా.. ఎక్కడెక్కడో మారుమూల ఉన్న ప్రతిభావంతులను వెలికితీయడం లాంటి ప్రయత్నం ఇప్పుడసలు జరుగుతోందా..? ఇదంతా చాలా పెద్ద ప్రశ్న. నెటిజన్లలో ఇప్పుడు ఇలాంటి చర్చ చాలా ఎక్కువగా జరుగుతోంది.
అసలు సింధు పతకం సాధిస్తే.. తనవల్లనే పతకం వచ్చిందని చెప్పకుంటున్న చంద్రబాబు దీన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఆయన గోపీచంద్ ఛాంపియన్ షిప్ గెలిస్తేనే అకాడమీకి స్థలం ఇచ్చాడు తప్ప.. గెలవడం కోసం చేసిందేమీ లేదు. గోపీచంద్ ఒక్కడికి స్థలం ఇవ్వడంతో సరిపోతుందా..? రాష్ట్రంలో ఇక క్రీడల గురించి పట్టించుకోరా? గెలిచిన వాళ్లను నెత్తికెత్తుకుంటారే తప్ప.. గెలిచేవాళ్లను తయారు చేయడానికి ముష్టి విదిల్చకుండా నాటకాలు ఆడుతారా?
ఈ అంశాల మీద ప్రభుత్వాలు చూపు సారించాలి.
నెటిజన్లలో చెలాణీ అవుతున్న ఓ చిన్న వ్యాసాన్ని ఈ సందర్భంగా గమనించండి. ప్రభుత్వాలు వాస్తవంగా ఏం చేయాలో, ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది.
...
' సింధు' ని చూసి ఏమి నేర్చుకోవాలి
సింధు సాధించిన వెండి పతకంతో భారతీయులందరు మురిసిపోయారనేది ముమ్మాటికీ నిజమే..! గెలిచినవాడి భుజం మీద చెయ్యి వేసి వీడు మా వాడే అని విర్రవీగి చెప్పే వెర్రి వెంగళప్ప ప్రభుత్వాలు ;
ఈ ఘటన నుండి ఏమి నేర్చుకున్నాయి ...?
అతి ఉత్సాహం ప్రదర్శించి ప్రజల సొమ్ముని ప్రసాదం లా పంచే హక్కు యాడ ఉంది (అన్ని కోట్లా ) నాయకులకు అంత ఆనందం పట్టలేకుంటే పార్టీ నిధుల్లోనుంచో మీ జేబు లోనుంచి ఇవ్వండి సంతోషిస్తాం..
మీరు చేయవల్సిందీ - సింధు కి కోట్లు రూపాయలు - కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి
( అది జనం కష్టార్జితం ). సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తయారు చేయాలి ,అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో ఏ క్రీడావిధానం అమలుచేస్తారు ?? చెప్పండి !!
స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు పరీక్షల్లో మార్కులు కలపండి. టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా సరే పిల్లలు ఆటలు ఆడవల్సిందే అని హుకుం జారీ చేయండి. ప్లేయింగ్ కిట్స్ - అన్ని స్కూల్స్ కు ఉచితంగా ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం ). ఒలింపిక్స్ కాదు ముందు లోకల్ టోర్నమెంట్సు -ఆడించండి. లోకల్ టాలెంటెడ్ ' సింధూ ' లు చాలా మంది ఉన్నారు ,;
పాపం మీ దరిద్రగొట్టు విద్యావిధానాల వలన - ఇంటా - బయట - స్కూల్లోనూ ప్రతి క్షణం - చదువు - చదువు - పరీక్షలు - మార్కులు -అని ఒకటే బెంగతో ఇటు తల్లితండ్రులు - అటు పిల్లలు క్లాసురూముల్లో - హోంవర్కుతో మగ్గి పోతున్నారు - వారంతా - ఒక్కసారిగా - మైదానంలో అడుగిడితే , ప్రపంచంలో భారతీయులకి బోలెడు పతకాలు దక్కుతాయి.
సచిన్ ని మోసినంత కాలం మోసారు . ఏమైంది ? ఇ ప్పుడు ఎంతమంది సచిన్ లు రడీగా ఉన్నారు ; అమ్మా ' సింధూ ' నీ విజయాన్ని తక్కువ చేయటానికి కాదమ్మా నే అంటున్నది. ఈ మాత్రం చలనం కలిగించావు అందుకు నీకు జే జే లు . ఎప్పటికప్పుడు డ్రామాలాడే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల - విద్యా -క్రీడా విధానాలపైనే నా ఆవేదన... 130 కోట్ల జనాభా ఉంది. చేయూతనివ్వండి , ఒకొక్క క్రీడకి శత వీరులు సిద్ధమవుతారు..... జయహో భారత్ !! జయహో !!!
- డాక్టర్ ఆరంబాకం చలం, తిరుపతి