చేయాల్సిందంతా చేశారు.. ఈ 2019 ఎన్నికల్లో గెలవడానికి ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా కష్టపడ్డారు. నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం.. జ్యోతిష్యుల మాట.. చివరకు పోలింగ్ వరకు నిష్టగా నియమాలు పాటించారు. చేతికి ఉంగరాలు - కడియాలు ధరించారు. నమ్మకాలు - గ్రహాల కోసం పాకులాడారు. చివరకు పోలింగ్ ముగిసింది. ప్రజల ఫలితం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.. గ్రహాలను అనుకూలంగా మలుచుకున్న నేతలు.. ఇప్పుడు ప్రజా అనుగ్రహం కోసం వేచిచూస్తున్నారు.
మొన్నటి ఎన్నికల వేళ నేతలు సెంటిమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ విశాఖ శారద పీఠం అధిపతి ఆశీర్వాదం తీసుకొనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు తిరుమల వెంకన్నను దర్శించుకొని అక్కడే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇక వైసీపీలో సీనియర్ నేతలుగా ఉండి పదవుల రేసులో ఉన్నా పెద్దారెడ్డి - ఆర్కే రోజా లు కూడా ఇంట్లో హోమాలు చేయించుకున్నారు. శ్రీకాళహస్తి పూజరులతో పెద్దారెడ్డి పెద్ద యజ్ఞమే చేయించారు. రోజా నామినేషన్ రోజున కంచి పీఠాధిపతి ఇచ్చిన సుందర దండను చేతికి కట్టుకొని నామినేషన్ వేశారు. పోలింగ్ రోజు సుదర్శన యాగం నిర్వహించారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తరుఫున కుప్పంలో టీడీపీ నేతలు అంతా తామై వ్యవహరించారు. బాబు గెలుపు కోసం కుప్పం లోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వెదురు బుట్టలో నామినేషన్ల పత్రాలకు పూజలు చేయించి నామినేషన్లు వేశారు. చెవిరెడ్డి కూడా స్వాముల ఆదేశానుసారం చేతికి రక్షా బంధనాలతో ప్రచారం చేశారు..
ఇక వీళ్లే కాదు.. ఏపీ వ్యాప్తంగా ఈ ఎన్నికల వేళ తమ గెలుపు కోసం పూజలు - పునస్కారాలు - గ్రహాల అనుకూలం కోసం నేతలంతా వెంపర్లాడారు.. చివరకు అన్నీ అనుకున్నట్టు పూర్తి చేశారు. మరి ఇప్పుడు గ్రహాలు అనుగ్రహించినా.. ప్రజాఅనుగ్రహం ఎంతవరకు లభిస్తుందనేది మే 23వరకు వేచిచూడాల్సిందే..