కుల రాజకీయాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి అని గగ్గోలు పెడుతున్న తరుణాన ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. ఇదే సమయంలో బీజేపీ ఎప్పటి నుంచో ఉన్న మైనార్టీ రిజర్వేషన్లను తగ్గిస్తామని అమిత్ షా నేతృత్వంలో మరో ఆసక్తిదాయక రాగం అందుకుంది. ఇవే ఇప్పుడు చర్చకు తావిస్తున్నాయి.
కాంగ్రెస్ ఎందుకని కులాల కుంపట్లు రాజేస్తుందో తెలుసు. ఒకనాటి దళిత ఓటు బ్యాంకు మొత్తం ఎలా లేదన్నా ప్రాంతీయ పార్టీలు లాగేసుకున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ లాంటి జాతీయ పక్షాలు కూడా లాగేస్తున్నాయి. ఈ తరుణాన దళిత ఓటరును మళ్లీ ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ కొత్త తరహా ప్రతిపాదన తెచ్చింది అని తెలుస్తోంది.
దేశంలో రాజకీయాలకే రిజర్వేషన్లు పనికివస్తున్నాయి అన్నది ఓ నిర్వివాదాంశం. అలా కాదు అన్నింటికీ ఇవే మూలం అని ఒప్పుకుంటే హస్తం పార్టీ వర్గీయులు నిజాలను అంగీకరించినట్లే ! కానీ దేశంలో మళ్లీ మళ్లీ నష్టాలను చేకూరుస్తున్న కుల వ్యవస్థ వద్దని, రిజర్వేషన్లు వద్దని చాలా మంది పట్టుబడుతున్నారు.
అడ్మిషన్ టైం లో కూడా కుల ప్రస్తావన లేకుండానే పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇదే సమయంలో కుల రహిత సమాజం, కులాంతర మరియు మతాంతర వివాహం అన్నవి జరుగుతున్న వేళ ఇప్పుడు మళ్లీ ప్రయివేటు రంగాన రిజర్వేషన్లు అని చెప్పడం దేనికి సంకేతం?
ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో నోటిఫికేషన్లు లేవు. ప్రయివేటు రంగానే కాస్తో కూస్తో నియామకాలు ఉన్నాయి. వాటిని కూడా సామర్థ్యం, ప్రతిభ అనే రెండు విషయాలను ప్రామాణికంగా చేసుకుంటూ సంబంధిత ఖాళీలు భర్తీ చేయడం కానీ నియామకాలు చేపట్టడం కానీ చేస్తున్నారు. అసలు కాస్తో కూస్తో సమాన అవకాశాలు అక్కడే లభిస్తున్నాయి.
ఇదే దశలో కాంగ్రెస్ తెలివిగా కులాల తేనెతుట్టె ను కదపడం దేనికి సంకేతం? అదేవిధంగా మతాల పేరిట రిజర్వేషన్లు, మైనార్టీల రిజర్వేషన్లు ఈ గొడవలు కూడా సహేతుకంగా లేవు. మరి! వీటి దృష్ట్యా ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలు కారణంగా మనుషులు విడిపోయి మళ్లీ మళ్లీ కొట్టుకోవడం జరగదు అని ఏంటి గ్యారంటీ ? కనుక దేశాన్ని విభజించి పాలించడం ఆపితే బెటర్ .. అప్పుడు బ్రిటిషర్లకూ మనకూ కాస్తో కూస్తో తేడా ఉంటుంది.