ఏపీ ఎలక్షన్స్ @ 10వేల కోట్లు

Update: 2019-04-14 11:18 GMT
దేశంలోనే ఖరీదైన ఎన్నికలు ఏవో తెలుసా.? మరేదో కాదు.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలే.. ఏపీలో పోటీచేస్తున్న ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ లు.. పోటీచేస్తున్న అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశాయట.. కొన్ని నియోజకవర్గాల్లో ఇది 100 కోట్ల వరకూ చేరిందట.. ముఖ్యంగా కోస్తా తీరంలో ఓట్ల కొనుగోలు విషయంలో ఇంకా భారీగానే ఖర్చు చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.  మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 10వేల కోట్లు ఖర్చు చేశాయని సమచారం.

ఓటుకు 2వేల చొప్పున ఏపీ వ్యాప్తంగా ఇస్తే కొన్ని చోట్ల 3వేల వరకూ సాగిందని సమాచారం. ఏపీలోనే అత్యధికంగా ఓట్ల కొనుగోలులో  పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నంబర్ 1 గా నిలిచిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న ఈ  భీమవరం నియోజకవర్గంలో దాదాపు 10వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. టీడీపీ, వైసీపీ ఇక్కడ గెలుపుకోసం ఒక్కో గ్రూపుకు 10వేల చొప్పున రూ.20 కోట్లు పంచాయట.. ఓటుకు ముందురోజు రాత్రి ఓటుకు రెండు వేల చొప్పున టీడీపీ-వైసీపీ లక్షన్నర మందికి రూ.60కోట్లు పంచాయట.. వీళ్లను చూసి జనసేన కూడా రూ.1000 చొప్పున పంచిందట.. ఒక్క భీమవరంలోనే పార్టీలు 100 కోట్ల వరకు ఖర్చు చేశాయట..

ఇక గుంటూరు జిల్లా చిలకూరిపేటలో కూడా టీడీపీ, వైసీపీ పోటీపడి ఓట్లు కొనుగోలు చేశాయట.. ఇక్కడ వైసీపీ 1000 రూపాయలు ఇస్తే.. టీడీపీ 2వేలు ఇచ్చిందట.. దానికి తోడు ఇంటింటికి క్వార్టర్ బాటిల్ డోర్ డెలివరీ చేశారట.. అనపర్తిలో ఒక పార్టీ అభ్యర్థి ఓటుకి రూ.2వేలు చొప్పు లక్ష ఓట్లకు రూ.20 కోట్లు ఇచ్చారట.. మండపేటలో ఏకంగా ఓటుకు రూ.3వేల వరకూ టీడీపీ, వైసీపీ ఇచ్చాయట.. ఇలా కనీసం నియోజకవర్గానికి 50కోట్లదాకా పార్టీలు ఏపీలో ఖర్చు చేశాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

రూ.50 కోట్ల చొప్పున ఒక్కో నియోజకవర్గానికి వేసుకుంటే మొత్తం 175 నియోజకవర్గాలకు రూ.8750 కోట్లు అవుతాయి. ఇదంతా ఓటర్లకు పంచిన మొత్తమే.. ఇది కాకుండా ఎన్నికల ప్రచారం.. ర్యాలీలు, ఇంటికి క్వార్టర్, కార్యకర్తల మేపుడు - పార్టీ కార్యాలయాల నిర్వహణకు ఇలా ఖర్చు అంతా కలిసి 10వేల కోట్లు దాకా దాటిపోతుందని రాజకీయ వర్గాలు లెక్కేసి చెబుతున్నాయి. ఈసారి డబ్బును ఏరులా పారించినా ఈసీ కానీ పోలీసులు కానీ ఏం చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 10వేల కోట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేశారట.. ఇలా అంత కలిసి దేశంలోనే ఏపీ ఎన్నికలను కాస్లీ చేసేశారని రాజకీయ అనలిస్టులు ఘంఠా పథంగా చెబుతున్నారు. 
Tags:    

Similar News