ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సింహాల చిహ్నంపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. ఆ సింహాల విగ్రహం నరేంద్ర మోడీలాగే కోపంగా చూస్తోందని మండిపడుతున్నాయి. సారనాథ్ లో మౌర్య చక్రవర్తి అశోకుడు వేయించిన స్థూపం నుంచి నమూనాగా తీసుకున్న నాలుగు సింహాల విగ్రహాన్ని మోడీ ప్రభుత్వం చెడగొట్టిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం తమకు నచ్చినట్టు ఆ చిహ్నాన్ని మార్పించిందని ధ్వజమెత్తుతున్నాయి.
నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నం అవమానకరంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు జవహర్ సర్కార్, మహువా మొయిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సారనాథ్‌లోని అశోకుని నాలుగు సింహాలతో పోల్చితే పొంతన లేకుండా, దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే సింహాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
మరోవైపు నాలుగు సింహాల విగ్రహాన్ని తయారుచేసిన శిల్పి సునీల్ ధియోధర్ తనను ఎవరూ ప్రభావితం చేయ్లలేదని చెబుతున్నారు, కొత్త చిహ్నం ఏర్పాటు చేసే ముందు సారనాథ్‌లో గల చిహ్నాన్ని పరిశీలించానని అంటున్నారు. సారనాథ్ లో ఉన్నట్టే ఆ చిహ్నం యథావిధిగా వచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొంటున్నారు. తొమ్మిది నెలలు కష్టపడి ఈ చిహ్నాన్ని రూపొందించామని ఆయన చెబుతున్నారు.
విగ్రహం తయారీకి ముందు మట్టితో ఓ నమూనాను తయారు చేశామన్నారు. ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను రూపొందించామని తెలిపారు. నాలుగు సింహాల విగ్రహాన్ని కంచుతో తయారు చేశామని వివరించారు. దీని బరువు 9,500 కిలోగ్రాములని వెల్లడించారు. విగ్రహం ఎత్తు 6.5 మీటర్లని, పూర్తిగా ఉక్కుతో దీన్ని నిర్మించామని వివరించారు.
సారనాథ్ లో ఒరిజినల్ చిహ్నం ఎత్తు 3 నుంచి 3.5 అడుగులు మాత్రమే ఉందన్నారు. అయితే పార్లమెంట్ వద్ద ఏర్పాటు చేసిన చిహ్నం 21.3 అడుగుల ఎత్తు ఉందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఫొటోలను కింది నుంచి తీశారని.. అందుకే సింహాల ముఖాల్లో తేడా కనిపిస్తోందన్నారు. అలాగే ఈ చిహ్నం తయారు చేయడానికి బీజేపీ ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు టాటా ప్రాజెక్టు లిమిటెడ్ పని అప్పగించిందని వివరించారు.
కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ దీనిని ఆవిష్కరించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 13 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు అంతస్థుల పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అక్టోబరునాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలోనే జరుపుకునే అవకాశం ఉంది.