డిసెంబర్ లో పార్టీలకిక పే..ద్ద పని

Update: 2017-02-03 05:05 GMT
ప్రజలకు చట్టాలు చేసి.. వారెలా ఉండాలి?అన్న విషయాన్ని చెప్పే పొలిటికల్ పార్టీలు.. తమ వరకు వచ్చేసరికి మాత్రం ఎలా వ్యవహరిస్తాయన్న విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చట్టప్రకారం తమ ఆదాయానికి సంబంధించినవివరాలు.. ట్యాక్స్ రిటర్న్ లు లాంటివి ఎంతకూ దాఖలు చేయని నిర్లక్ష్యం కనిపిస్తుంది. అంతేకాదు.. ఎన్నికల సంఘానికి అందించాల్సిన వివరాల విషయంలోనూ అంతులేని జాప్యాన్ని చేస్తుంటాయి.

దీంతో పలుమార్లు ఒకే అంశానికి సంబంధించి పార్టీలకు నోటీసుల మీద నోటీసుల్ని జారీ చేస్తుంటాయి ఎన్నికల సంఘం. ఇలాంటి నిర్లక్ష్య ధోరణులు చిన్నాచితక రాజకీయ పార్టీలు చేస్తుంటాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రముఖ రాజకీయ పార్టీలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తుంటాయి. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసే పనిని షురూ చేసింది కేంద్ర సర్కారు.

ఏ ఏడాదికి ఆ ఏడాది డిసెంబరు చివరి నాటికి తమ ఆదాయపన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఒకవేళ.. సకాలంలో కానీ రాజకీయ పార్టీలు కానీ తమ రిటర్న్స్ ను దాఖలు చేయని పక్షంలో.. వాటికిచ్చే మినహాయింపుల్ని కోల్పోవాల్సి ఉంటుంది.ఇప్పటివరకూ ఇష్టరాజ్యంగా వ్యవహరించే పార్టీలకు తాజా నిర్ణయం శరాఘాతంగా మారుతుందనటంలో సందేహం లేదు.

తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రతి అసెస్ మెంట్ ఇయర్ చివరిలోనూ ఆదాయపన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి కటాఫ్ డేట్ గా డిసెంబరు 31ను నిర్ణయించారు. ఈ ప్రతిపాదన పుణ్యమా అని ఏడాది చివరల్లో రాజకీయ పార్టీలకు పే..ద్ద పనే అని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News