రాజకీయ పార్టీలకు వ్యాపారవేత్తలు సహా వివిధ వర్గాల నుంచి "అధికారికంగా" వచ్చే విరాళాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ప్రముఖ జాతీయ పార్టీలకు రూ.20,000కు పైబడి రూ.102 కోట్ల విరాళాలు వచ్చినట్లు తేలింది. ఏడు జాతీయ పార్టీలకు వచ్చిన ఈ విరాళాల్లో సహజంగానే అధికార బీజేపీకే ఎక్కువగా వచ్చినట్టు అసొసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ - నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
రూ.20 వేలకు పైబడి విరాళం ఇచ్చిన వ్యక్తులు - సంస్థల వివరాలు వెల్లడించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఏడు జాతీయ పార్టీలు బీజేపీ - కాంగ్రెస్ - ఎన్ సీపీ - సీపీఐ - సీపీఎం - టీఎంసీ - బీఎస్పీ వివరాలు అందించాయి. ఈ వివరాల ప్రకారం 2015-16 సంవత్సరంలో ఏడు పార్టీలకు కలిపి 1,744 మంది దాతల ద్వారా రూ.102.02 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీకి 613 మంది దాతల ద్వారా రూ.76.85 కోట్లు - కాంగ్రెస్ కు 918 మంది ద్వారా రూ.20.42 కోట్లు వచ్చాయి. మిగతా పార్టీలకు వచ్చిన మొత్తంతో పోలిస్తే బీజేపీకి మూడురెట్లు ఎక్కువగా విరాళాలు అందడం విశేషం. బీఎస్పీ మాత్రం తమకు రూ.20,000కు పైచిలుకు ఒక్క డొనేషన్ కూడా రాలేదని పేర్కొంది.
ఆశ్చర్యకరంగా 2014-15తో పోల్చినప్పుడు పార్టీలకు రూ.20 వేలకు పైబడి వచ్చిన విరాళాలు 84 శాతం తగ్గాయి. గత ఏడాది రూ.528.67 కోట్లు రాగా ఈసారి రూ.102 కోట్లకే పరిమితమైంది. బీజేపీకి గత ఏడాది రూ.437.35 కోట్లు రాగా ఈ ఏడాది 82 శాతం తగ్గి రూ.76.85 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే 2013-14తో పోల్చినప్పుడు 2014-15లో బీజేపీకి 156 శాతం - కాంగ్రెస్ కు 137 శాతం అధికంగా విరాళాలు వచ్చాయి. 2014లో 16వ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విరాళాలు పెరిగి ఉండవచ్చని సర్వే అభిప్రాయపడింది. రూ.102 కోట్లలో కేవలం రూ.1.45 కోట్లు మాత్రమే నగదు రూపంలో వచ్చాయని పార్టీలు వెల్లడించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/