సార్వత్రిక ఎన్నికల ఖర్చు ప్రతిసారీ పెరుగుతూనే ఉంది. రూ.వేల కోట్లలో మార్పు వస్తోంది. ప్రతి ఎన్నికకూ ఎంతో వ్యత్యాసం ఉంది. గత ఆరు పర్యాయాల ఎన్నికలను పరిశీలిస్తే సుమారు ఏడు రెట్లు పెరిగింది. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రం కావు. ఓ ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. సార్వత్రిక ఎన్నికల చరిత్రలో దుబారా ఎన్నికలుగా పేరు పెట్టారు. మొత్తం రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మిగతా పార్టీల కంటే బీజేపీ ఖర్చు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎన్నికల ఖర్చు దుబారాగానే ఉంటోంది. గత 2016లో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రూ.45 వేల కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ లెక్కన వచ్చే 2024 ఎన్నికల నాటికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
1998లో రూ.9 వేల కోట్లు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గత 1998లో దేశవ్యాప్తంగా జరిగిన 543 స్థానాలకు గానూ మొత్తం ఖర్చు రూ.9 వేలు కోట్లుగా నిర్దారించారు. అయితే మరుసటి ఏడాది 1999 ఎన్నికలకు వచ్చే సరికి ఖర్చు మొత్తం రూ.10 వేల కోట్లకు చేరింది. ఈ ప్రకారం ప్రతి ఎన్నికకూ ఖర్చు పెరుగుతూనే ఉంది. అయితే గత 2014, 2019 ఎన్నికలకు రెట్టింపు కావడం విశేషం. గత 2014 ఎన్నికల్లో మొత్తం ఖర్చు రూ.30 వేల కోట్లుగా తేలగా.. ఈసారి 2019 ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. ఇందులో బీజేపీ సుమారు 45 శాతం వినియోగించినట్లు తెలుస్తోంది. కాగా ఈ లెక్కన దేశంలోని ప్రతి ఓటరుకు సరాసరి రూ.700 చొప్పున ఖర్చు చేసినట్లు చెప్పవచ్చు.
కాంగ్రెస్ తక్కువగానే..
ఈసారి ఎన్నికల్లో మొత్తం ఖర్చులో బీజేపీ 45 శాతం ఖర్చు చేయగా.. కాంగ్రెస్ అంతకంటే తక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గత 1998లో బీజేపీ 20 శాతం, 2009లో కాంగ్రెస్ 40 శాతం చొప్పున ఖర్చు చేశాయి. అయితే ఈసారి కాంగ్రెస్.. కేవలం 15 – 20 శాతం మించి ఖర్చు చేసినట్లు లేదని తెలుస్తోంది. కాగా ఇందులో రూ.12 – రూ.15 వేల కోట్లు నేరుగా ఓటర్లకు పంచినట్లు సమాచారం. మరో రూ.25 వేల కోట్లు ప్రచారానికి.. మరో రూ.6 వేల కోట్లు రవాణా సౌకర్యాలకు.. ఇతర ఖర్చులకు అదనంగా ఇంకో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.
లోక్ సభ ఎన్నికలు ఖర్చు (రూ.కోట్లలో)
1998 రూ.9,000
1999 రూ. 10,000
2004 రూ. 14,000
2009 రూ. 20,000
2014 రూ. 30,000
2019 రూ. 60,000