కొన్ని విషయాలు కావాలని చేయరు. కానీ.. మనసుకు నచ్చినట్లుగా చేసే పనులతోవచ్చే మైలేజీ అంతాఇంతా కాదు. తాజాగా తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వం తీరు కూడా ఇంచుమించు ఇలానే ఉంది. మొన్నటి వరకూ అమ్మ.. చిన్నమ్మ నీడలో ఉన్న ఆయన.. వారు చెప్పినట్లే నడుచుకునే వారే తప్పించి.. ఏ రోజూసొంతంగా తనకు తోచినట్లుగా చేసింది లేదు. అందుకే ఆయనలోని చాలా విషయాలు బయటకు రాని పరిస్థితి.
చిన్నమ్మతో పేచీ పెట్టుకొని తిరుగుబాటు చేసిన ఆయన ఇప్పుడు ఆమెతోనే సై అంటే సై అంటున్నారు. సీఎం కుర్చీ కోసం విపరీతంగా చిన్నమ్మ.. పన్నీర్ విపరీతంగా పోటీ పడుతున్న వేళ.. తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇలాంటి వేళలో.. వీలైనంత వరకూ ఎమ్మెల్యేల్ని సమీకరించుకోవటం.. బలం పెంచుకోవటం మీద ఫోకస్ చేయటం కనిపిస్తుంది.
కానీ.. పన్నీర్ ఇంటి దగ్గర పరిస్థితి మరోలా ఉంది. ఓపక్క తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే.. తనను కలవటానికి.. మద్దతు ఇచ్చేందుకు వస్తున్న నేతల్ని సాదరంగా ఆహ్వానించటం.. వారికి అవసరమైన భోజన ఏర్పాట్లను చూడటం పలువురిని ఆకట్టుకుంటుంది. తమిళనాడు రాజకీయాల్లో ఇంటికి వచ్చిన వారికి భోజనం.. టిఫిన్ పెట్టి పంపించటం అప్పట్లో ఏంజీఆర్ మాత్రమే చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు.. అదే రీతిలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం అదే రీతిలో వ్యవహరించటం గమనార్హం.
తనను కలిసేందుకు.. తనకు మద్దతు ఇచ్చేందుకు వస్తున్నవారందరికి టిఫిన్లు.. భోజనాలు ఏర్పాటు చేయటంతో పాటు.. టాయిలెట్ల సౌకర్యాన్ని అందిస్తున్నారు. రోజురోజుకు పన్నీర్ కు మద్దతు ఇచ్చేందుకు వస్తున్న మద్దతుదారుల రద్దీ పెరిగిపోతోంది. దీంతో.. షామియానాలు వేసి మరీ వారిని ఆహ్వానిస్తున్నారు. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి.. తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ వర్గాలకు మాత్రమే కాదు.. పన్నీర్ ఇంటి వద్ద సెక్యూరిటీ కోసం వచ్చిన పోలీసులు..రిపోర్టింగ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిదులకు సైతం టిఫిన్.. భోజన సౌకర్యాన్ని కల్పించటంతో.. వారంతా గతంలో ఇదే రీతిలో ఎంజీఆర్ చేసేవారంటూ ఆయనతో పన్నీర్ ను పోలుస్తూ మాట్లాడుకోవటం కనిపిస్తోంది.