మ‌త్స్య‌కార‌ ర‌గ‌డ‌లో మ‌కిలి రాజ‌కీయం.. నేరం ఎవ‌రిది?

Update: 2020-12-20 03:30 GMT
ప్ర‌కాశం జిల్లాను రెండు వారాల పాటు కుదిపేసిన రెండు గ్రామాల‌కు చెందిన మ‌త్స్య‌కార వివాదంలో రాజ‌కీయాలు చోటు చేసుకు న్న విష‌యం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన అందునా అధికార పార్టీకే చెందిన నేత‌లు రోడ్డున ప‌డ్డారు. వేట‌కు సంబంధించి.. ఇటు వాడ‌రేవు.. అటు క‌ఠారిపాలెం మ‌త్స్య‌కారుల మ‌ధ్య నెల‌కొన్న‌ది .. వారి జీవ‌నా ధా ర‌మైన వృత్తికి సంబంధించిందే. ఇరు ప‌క్షాల‌దీ అర్ధం చేసుకోవాల్సిన వివాద‌మే. వాడరేవు మత్స్యకారు లు బల్ల వలను వాడటంపై వేటపాలెం మండలం కఠారివారిపాలెం మత్స్యకారులు, కఠారివారిపాలెం మ‌త్స్య‌కారులు ఐలా వలతో వేట చేయ‌డాన్ని వాడ‌రేవు మ‌త్స్య‌కారులు అడ్డుకుంటున్నారు. ఇది చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య ఘర్షణకు దారితీసింది.

అయితే.. ఈ విష‌యాన్ని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించే వీలున్న‌ప్ప‌టికీ.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, టీడీపీ త‌ర‌ఫున గెలిచి.. వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిన క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తిలు రంగంలోకి దిగారు. దీంతో ఇది రాజ‌కీయంగా ఇరు ప‌క్షాల వివాదంగా మారిపోయింది. ఒక వ‌ర్గంపై మ‌రో వ‌ర్గం దాడులు చేసుకోవ‌డం.. కేసులు పెట్టుకోవ‌డం గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిపోయాయి. అయితే.. స‌మ‌స్య ఏమైనా ప‌రిష్కారం అయిందా అంటే.. ఇప్ప‌టికీ నివును గ‌ప్పిన నిప్పును త‌ల‌పిస్తోంది. మ‌రి దీనికి బాధ్యులు ఎవ‌రు? ఎందుకు జ‌రిగింది? అనే కార‌ణాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక పార్టీకి చెందిన నాయ‌కుడిని.. మ‌రో పార్టీలోకి ఆహ్వానించ‌డం.. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న ఆమంచి దూకుడుకు అడ్డుక‌ట్ట‌వేసే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోవ‌డం వంటివి వైసీపీ అధినేత జ‌గ‌న్ వైపే వేళ్లు చూపించేలా చేసింది.

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌ను పార్టీలోకి ఆహ్వానించిన జ‌గ‌న్‌.. ఇక్క‌డ ఆధిప‌త్య పోరుకు బీజం ప‌డుతుంద‌నే విష‌యాన్ని ఊహించ‌లేదా? అంటే.. ఊహించారు. ఆయ‌న‌కు తెలియ‌కుండా ఏమీ లేదు. కానీ, వారే స‌ర్దుకుంటా రులే.. అనుకున్నారు. కానీ, నిత్యం ఇక్క‌డ ఏదో ఒక రూపంలో వివాదం తెర‌మీదికి వ‌స్తూనే ఉంది. అయినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకో లేదు. డీఎస్పీల బ‌దిలీల నుంచి త‌హసీల్దార్ల బ‌దిలీ వ‌ర‌కు ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర ఆధిప‌త్యం సాగింది. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ క‌లుగజేసుకోవాల‌ని.. ఆమంచి వ‌ర్గం కోరుకుంది. అయినా కూడా జ‌గ‌న్ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

త‌న‌కు రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నే యావ‌త‌ప్ప‌.. స్తానికంగా నేత‌లు కొట్టుకున్నా ఫ‌ర్వాలేద‌నే వాద‌న అప్ప‌ట్లోనే తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు తార‌స్థాయికి చేరింది. ఇటీవ‌ల క‌ర‌ణం బ‌ల‌రాం పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా కూడా వివాదం చోటు చేసుకుంది. దీనిపైనా ఆమంచి వ‌ర్గం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేసింది. అయినా.. ఆయ‌న నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌రిణామాలు ఎలా పార్టీకి లాభిస్తాయో.. తెలియ‌దు కానీ.. నియోజ‌క‌వ‌ర్గాన్ని.. జిల్లా రాజ‌కీయాల‌ను మాత్రం రాజ‌కీయంగా ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసేలా చేశాయ‌నేది మేధావుల మాట‌. మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు న‌డుం బిగిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News