రాహుల్ గాంధీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళుతున్న టీ కాంగ్రెస్ కు అనుకోని అవాంతరం ఎదురైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టూర్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన్ను ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లాలనని కలలుగన్న కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
శుక్రవారం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంది. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అయితే ఇందుకు ఓయూ రిజిస్ట్రార్ నిరాకరించడంతో కాంగ్రెస్ వాదులు దీనిపై హైకోర్టుకెక్కారు. ఓయూ రిజిస్ట్రార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మానవతా రాయ్, మరో ముగ్గురు అత్యవసరంగా హైకోర్టులో రాహుల్ కార్యక్రమానికి అనుమతి కోసం పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓయూలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో ముఖాముఖికి అనుమతిని హైకోర్టు నిరాకరించింది. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా వినియోగించడం సరికాదని పేర్కొంది.
ఈ క్రమంలోనే పిటీషనర్ స్పందిస్తూ.. ‘గతంలో సీఎం జన్మదిన వేడుకలు.. బీజేపీ మాక్ అసెంబ్లీ, జార్జిరెడ్డి జయంతి జరిగాయని’ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అనుమతించారన్న కారణంగా రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని.. ఓయూ పాలక మండలి తీర్మానానికి విరుద్ధంగా అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకే కానీ నెగెటివ్ విషయాలకు కాదని తేల్చిచెప్పింది.
రాహుల్ నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించే ఠాగూర్ ఆడిటోరియంకు 2. కి.మీల దూరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. యూనివర్సిటీలో ఏ కార్యక్రమం సరైందో కాదో రిజిస్ట్రారే సరైన నిర్ణయం తీసుకోగలరని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
యూనివర్సిటీలు అంటే విద్య, శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని.. యూనివర్సిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించరాదని హైకోర్టు అభిప్రాయపడింది. క్యాంపస్ లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించేలా సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు సూచించింది.