మోడీ ల‌గేజ్ చెక్ చేశాడు.. ఊద్యోగం ఊడింది!

Update: 2019-04-18 05:42 GMT
వ్య‌వ‌స్థ‌ల్ని ఎలా న‌డ‌పాల‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన అవ‌స‌రం నేత‌ల‌కు చాలానే ఉంది. తాను చేస్తే త‌ప్పు కానీ.. ప‌క్క‌నోళ్లు చేస్తే త‌ప్ప‌న్న‌ట్లుగా ఫీల‌య్యే బ్యాచ్ ఒక‌టి ఉంది. కొన్ని సంద‌ర్భాల్లో రూల్స్ అన్న‌వి ఉన్నా.. పుస్త‌కాల్లో త‌ప్పించి.. అమ‌ల్లో అస్స‌లు క‌నిపించ‌వు. ఇలా నిస్స‌హాయంగా క‌నిపించే చ‌ట్టం.. ఎంత క‌ర‌కు అన్న విష‌యం ముదురుకేసు లాంటోడి చేతికి క‌ర్ర పెత్త‌నం చేసే  ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడు కానీ అర్థం కాదు.

అత‌గాడు చెలాయించే అధికారాన్ని చూసి.. మ‌నం కూడా ట్రై చేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఇంత‌కీ ఈ మాట‌ల‌న్ని ఇప్పుడే ఎందుకు చెబుతున్నారంటారా? ఏంటో.. అలా చెప్పాల‌నిపించింది. ఆ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలేద్దాం. అస‌లు విష‌యంలోకి వెళ‌దాం. ఇప్పుడు చెప్పే విష‌యంలో ఎక్క‌డైనా.. ఏదైనా అంశానికి సంబంధించి క‌నెక్ట్ చేసుకోవాల‌నిపిస్తే క‌నెక్ట్ చేసుకోండి. లేదంటే వ‌దిలేయండి.

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక  ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులు ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ల‌ను త‌నిఖీ చేయ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు.. ముఖ్య‌మంత్ర‌లు మాత్రం పైనుంచి దిగి వ‌చ్చిన వారు కాదు క‌దా?  అందులోకి.. త‌నిఖీ చేస్తోంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే అధికారులు క‌దా? అంటూ స‌రిపెట్టుకున్నోళ్లు ఉన్నారు. ఎప్పుడూ లేనిది మ‌రీ ఇంత దారుణంగానా? అని ఫీలైనోళ్లు ఉన్నారు. అరే.. సీఎం స్థానంలో ఉన్నోళ్లకు కూడా త‌నిఖీలా అంటూనే.. చ‌ట్టం ఇలా అంద‌రికి ఒకేలా అమ‌లు చేస్తున్నారే అంటూ సంతోష‌ప‌డినోళ్లు లేక‌పోలేదు.

ఇలాంటి వేళ‌.. ప్ర‌ధాని మోడీ ల‌గేజ్ ను చెక్ చేసిన అద్భుతం కూడా చోటు చేసుకుంది. ఒడిశాలోని సంబ‌ల్ పూర్ లో ప‌రిశీల‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఐఏఎస్ అధికారి ఒక‌రు.. మోడీ ప్ర‌యాణించి వ‌చ్చిన హెలికాఫ్ట‌ర్లోని ల‌గేజ్ ను త‌నిఖీ జ‌రిగే ప్ర‌య‌త్నం చేశారు. క‌ర్ణాట‌క క్యాడ‌ర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మొహ‌మ్మ‌ద్ మొహ‌సిన్ చెకింగ్ చేయ‌టంపై ఈసీ త‌క్ష‌ణ‌మే స్పందించింది.  నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్పీజీ ర‌క్ష‌ణ‌లో ఉన్న వ్య‌క్తుల‌కు సోదాల నుంచి మిన‌హాయింపు ఉంది.

ఈ విష‌యం తెలిసి మ‌రీ.. త‌నిఖీలు చేసి ఉంటార‌న్న కార‌ణంతో స‌ద‌రు ఐఏఎస్ అధికారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. విధుల నుంచి త‌ప్పించిన‌ట్లుగా ఈసీ వెల్ల‌డించింది. అంతేకాదు.. సంబ‌ల్ పూర్ ను సంద‌ర్శించి విచార‌ణ జ‌రిపి.. ప్ర‌ధాని మోడీ ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ ను త‌నిఖీ ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని డిప్యూటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ధ‌ర్మేంద్ర‌శ‌ర్మ‌ను ఆదేశించారు. అయినా.. కొన్ని కొంద‌రు మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. అంద‌రూ అలా చేయాల‌నుకుంటే ఇలానే జ‌రుగుతుంది మ‌రి. ఇప్ప‌టికైనా అర్థ‌మైందా?  రాజ‌దండం చేతిలో ఉండ‌గానే స‌రికాదు. దాన్ని ఎలా ఆడించాలో కూడా తెలియాలి. లేకుంటే.. తిప్ప‌లు త‌ప్ప‌వు.
Tags:    

Similar News