జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 44 మంది నేర చరితులు , రేపిస్టులు

Update: 2019-11-30 07:10 GMT
సాధారణంగా మనం ఎవరిపైనైనా ఒక కేసు ఫైల్ అయ్యి ఉన్నా కూడా వారిని అదో రకంగా చూసి ఈ సమాజం నుండి వారిని తరిమి కొట్టాలని చెప్తాం. కానీ, అదే నేరచరిత్ర గల వారు ఎన్నికలలో పోటీ చేస్తే  మాత్రం వారికీ జై కొట్టి ..ఓట్లు గుద్ది అధికారం ఎక్కిస్తారు. అలాంటి నేర చరిత్ర కలవారు అధికారంలోకి వస్తే ..వారు చేసే ప్రజాపాలన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ , ప్రజలు మాత్రం అలాంటివారికే ఓట్లు వేస్తారు ..ఎన్నికల అధికారులు కూడా అలాంటివారికె అవకాశం ఇస్తారు. ఇకపోతే తాజాగా జార్ఖండ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.  నేడు మొదటిదశ పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక రెండవ దశ పోలింగ్  డిసెంబర్ 7 న జరగనుంది.

ఇక ఈ రెండో దశ పోలింగ్ లో   260 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారిలో సుమారుగా 17 శాతం మంది అంటే .. 44 మంది తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. వారిలో నలుగురు అభ్యర్థులు తమపై హత్య కేసులున్నాయని వెల్లడించగా .. మరో నలుగురు  మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను  ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి అత్యాచారానికి సంబంధించినది కావడం గమనార్హం. మరో ఎనిమిది మంది అభ్యర్థులు హత్యాయత్నానికి(ఐపిసి -307) సంబంధించిన కేసులు తమపై ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  చేసిన సర్వే ప్రకారం వీరిలో..  కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న ఆరుగురు అభ్యర్థులలో ముగ్గురు,  జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి పోటీ చేస్తున్న 14 మంది అభ్యర్థులలో ఐదుగురు,  బిజెపి పోటీ  చేస్తోన్న 20 మంది అభ్యర్థులలో ఐదుగురు, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతంత్రిక్) పార్టీ నుంచి 20 మంది అభ్యర్థుల్లో.. ఐదుగురు ,ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులలో ఒకరు…  తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్స్‌లో పొందుపరిచారు. 
Tags:    

Similar News