తెలంగాణలో జగన్ పార్టీకి ఎంత బలం ఉందో రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి తెలిసిందే. ఆశ్చర్యకరంగా ప్రధాన పార్టీలు సైతం ఆత్మవిశ్వాసంగా చెప్పలేని బడాయి మాటలు చెప్పేయటం జగన్ బ్యాచ్ కే సాధ్యమవుతుందంటున్నాయి రాజకీయ వర్గాలు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టటమే ఒక విశేషం అయితే.. తమ పార్టీకి గెలుపు పక్కా అంటూ అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది.
తెలంగాణలో బలం లేని మీ పార్టీ వరంగల్ లో బలమైన పోటీ ఇస్తుందని ఎలా చెబుతారంటే.. తమ దివంగత నేత వైఎస్ మీద ఉన్న అభిమానమే ఓట్లు వేసేలా చేస్తుందని చెబుతున్నారు. పేద.. మైనార్టీల సంక్షేమం కోసం పని చేసిన వైఎస్ ఏమేం చేశారో ప్రజలకు తాము చెబుతామని.. ఆయన తర్వాత ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి పని తీరు చూసిన నేపథ్యంలో వైఎస్ ఆశయాల కోసం పని చేసే తమ పార్టీకి విజయం కట్టబెడతారంటూ ఆపకుండా స్పీచ్ ఇచ్చేస్తున్న జగన్ బ్యాచ్ నేతల తీరు ఆసక్తికరంగా మారింది.
వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తారని.. మూడు రోజులు (నవంబరు 16..17..18) తేదీల్లో ఉప ఎన్నిక జరిగే ప్రతి సెగ్మంట్ కు వచ్చి ప్రచారం చేస్తారని చెబుతున్నారు. తమ అధినేత స్వయంగా వచ్చి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించటం పక్కా అంటున్నారు. జగన్ బ్యాచ్ మాటలు చూసిన వాళ్లంతా.. గెలుస్తారా?
లేదా? అన్నది వదిలేస్తే జగన్ బ్యాచ్ చెబుతున్న ధీమాగా మాటలు మాత్రం భలే ఉన్నాయంటున్నారు.