పొన్నాల కారును గుద్దేసిన ఓంకార్ ఔట్ డోర్ వాహనం

Update: 2019-10-29 05:09 GMT
పెను ప్రమాదం నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తప్పించుకున్నారు. ఆయన కారు మీదకు ఒక బస్సు ఢీ కొట్టింది. సోమవారం రాత్రి ఈ ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45 సిగ్నల్ వద్ద పొన్నాల కారు ఆగి ఉంది.

అదే సమయంలో ఓంకార్ ఔట్ డోర్ యూనిట్ కు చెందిన వాహనం ఢీ కొట్టింది. దీంతో పొన్నాల కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆయనతో పాటు.. పొన్నాల మనమడు కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి బయటకు వచ్చేసి.. వేరే కారులో అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటన చోటు చేసుకున్నంతనే జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.  ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఓంకార్ సినిమా ఔట్ డోర్ యూనిట్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News