ప్రజల్లో పుట్టే ఉద్యమాలను అణచివేయడంలో వాటికి అనుమతులు ఇవ్వకుండా నిరోధించడంలో ఏపీ పోలీసులు చాలా ముందంజలో ఉన్నారు. ఆ మాటకొస్తే తెలంగాణలోనే అంతో ఇంతో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ తాజా పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసుల బాటలో నడవడం నేర్చుకుంటున్నారా అనిపిస్తోంది. కరీంనగర్ లో మెడికల్ కాలేజీ కావాలంటూ అక్కడి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటే.. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది.
తెలంగాణ లో అధికార తెరాసకు కాంగ్రెస్ పార్టీనే గరిష్టంగా ప్రత్యర్థిగా వ్యవహరిస్తూ వారి మీద నిత్యం విమర్శలతో విరుచుకుపడుతూ ఉన్న సంగతి తెలిసిందే. నేరెళ్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ ఎంత హైలైట్ చేసి ఎంతగా బురద చల్లవచ్చో, అంతగానూ చేసింది. కాంగ్రెస్ జోరును అందుకోవడానికి వారితో సమానంగా తెరాసపై విరుచుకుపడడానికి తెలుగుదేశం నానా పాట్లు పడాల్సి వస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో కరీంనగర్ లో వైద్యకళాశాల కావాలంటూ మాజీ ఎంపీ చేయదలచుకున్న దీక్షను పోలీసులు అడ్డుకోవడం చూస్తే.. వారు ఏపీ పోలీసుల బాటలో నడుస్తున్నట్లుగా ఉంది. అచ్చంగా ముద్రగడ వ్యవహారంలో అక్కడి పోలీసులు చేస్తున్నట్లుగానే.. పొన్నం దీక్ష వలన శాంతి భద్రతల సమస్య వస్తుందనే నెపం చూపి వారు అనుమతులు నిరాకరిస్తున్నారు. ఇదివరలో కాంగ్రెస్ నిర్వహించిన చాలా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ఉద్యమాలు, సభలకు కూడా అనుమతులు ఇచ్చిన తెలంగాణ పోలీసులే కొత్త అలవాటు చేసుకుంటున్నారా అనిపిస్తోంది.
పొన్నం ప్రభాకర్ శనివారం నాడు కరీంనగర్ లో దీక్ష తలపెట్టారు. శాంతి భద్రతల సమస్యగా మారడానికి ఇదేమీ కులపరమైన దీక్ష కాదు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టి నడిపించే వ్యవహారమూ కాదు. అయితే.. పోలీసులు మాత్రం ముందు జాగ్రత్త పేరుతో కట్టిడి చేసేశారు. ఈ దీక్షను అడ్డుకోవడంపై తెరాస- కాంగ్రెస్ శ్రేణుల మధ్య అప్పుడే మాటలదాడులు మొదలయ్యాయి. అసలు ఇది అర్థం లేని దీక్ష అని గులాబీ నాయకులు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అడిగినా ఈ నియంత్రణలేంటి అంటూ కాంగ్రెస్ వారు నిందలు వేసుకుంటున్నారు.