రాహుల్ గాంధీ చేతిలో అందుకే చేయ్యేసే.. బీజేపీకి పూనమ్ కౌర్ కౌంటర్

Update: 2022-10-31 07:30 GMT
తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేయిలో చేయి వేసి మరీ నడిచి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది. తెల్లటి సాదాసీదా చీర కట్టుకొని కాంగ్రెస్ వాదిలో మారిపోయి రాహుల్ చేతిలో చేయి వేసి మరీ నడిచిన పూనమ్ కౌర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలను బీజేపీ మహిళా నేత ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం దుమారం రేపింది. 'తాత అడుగుజాడల్లో' అంటూ బీజేపీ నేత ప్రీతిగాంధీ కామెంట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ మహిళలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ రాహుల్ కుసారీ చెప్పాలని ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో నాలుగో రోజు  పాదయాత్ర చేపట్టారు. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారు. ధర్మాపూర్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్రలో రాహుల్ వెంట నటి పూనమ్ కౌర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.సాధారణంగా సోషల్ మీడియాలో రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడంలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు రాహుల్ గాంధీతో పాటు ఆయన చేయిలో చేయి కలుపుతూ నడుస్తూ అందరిని తనవైపు తిప్పుకునేలా చేసింది.

రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యల గురించి పూనమ్ కౌర్ పాదయాత్రలో నడుస్తూ రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు సమాచారం. అందుకే చేనేతలు నేసిన సాదా కాటన్ తెల్లటి చీరను ధరించి కనిపించింది. త్వరలో సోనియా గాంధీని కలవాలని పూనమ్‌కు రాహుల్ సూచించారని తెలిసింది.

ఈ మొత్తం వివాదానికి కారణమైన పూనం కౌర్ తాజాగా స్పందించారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను కలిసిన సందర్భంలో ఆయనతోపాటు నడుస్తూ ఆ చేతికి ఎందుకు పట్టుకున్నాన్న దానిపై పూనమ్ కౌర్ స్పందించారు. 'తాను పాదయాత్రలో కాలు జారి కింద పడబోతే రాహుల్ తన చేతిని పట్టుకున్నారని.. దీనికి ఇంత రాద్ధాంతం చేస్తారా?' అంటూ ప్రశ్నించారు.

మహిళల విషయంలో రాహుల్ గాంధీ స్పందన.. ఆయనిచ్చే గౌరవం, వారిని సంరక్షించే వైఖరి తనను హార్ట్ టచ్ చేశాయంటూ ట్వీట్ చేశారు. అలాగే బీజేపీ నేతలు దీనిపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ వారి విచక్షణకే వదిలిపెడుతున్నానంటూ పూనమ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు పూనమ్ ఇచ్చి కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News