ఔను...చ‌ర్చిల్లో న‌న్స్‌ కు పాస్ట‌ర్లు లైంగిక వేధింపులున్నాయి

Update: 2019-02-06 15:59 GMT
పోప్ ఫ్రాన్సిస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వేశారు. యూఏఈ నుంచి వాటికన్‌ కు విమానంలో వెళ్తున్న సమయంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పోప్ సమాధానమిస్తూ చ‌ర్చిల్లో చోటుచేసుకుంటున్న అవాంచ‌నీయ ప‌రిణామాల గురించి వివ‌రించారు. క్యాథలిక్ చర్చిల్లో నన్స్‌ ను తమ పాస్టర్లు, బిషప్స్ లైంగికంగా వేధించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కొందరు పాస్టర్లు, బిషప్స్ ఈ వేధింపులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.

గతవారమే వాటికన్‌ కు చెందిన ఓ మహిళల మ్యాగజైన్ ఈ అంశంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఎంతో మంది నన్స్ లైంగిక వేధింపులకు గురై గర్భాన్ని తొలగించుకోవడమో, పిల్లల్ని కనడమో చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. గతేడాది కేరళలోని ఓ చర్చిలో బిషప్ తనను చాలాసార్లు రేప్ చేశాడని ఓ నన్ ఆరోపించడంతో ఈ అంశంలోని తీవ్రత తెలిసొచ్చింది. దీంతో పోప్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఈ సమస్య అంతటా ఉన్నా కూడా.. కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉన్నదని ఆయన చెప్పారు. ఇప్పటికీ వేధింపులు జరుగుతూనే ఉన్నాయని, ఇది సడెన్‌ గా ఆగిపోయే సమస్య కాదని పోప్ అన్నారు. వాటికన్ ఎప్పటి నుంచో ఈ సమస్యపై ఎప్పటి నుంచో దృష్టి సారించిందని, ఇప్పటికే ఎంతోమందిని సస్పెండ్ చేసిందని పోప్ వెల్లడించారు. ఈ వేధింపుల సమస్యను అరికట్టడానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News