రేరెస్ట్ ఆప్ ద రేర్ పిక్..సెయింట్ పీటర్ స్క్వేర్ లో ఒంటరిగా పోప్

Update: 2020-03-29 02:30 GMT
పోప్ ఫ్రాన్సిస్... ప్రపంచంలోని క్రైస్తవులందరికీ గురువు. విశ్వవ్యాప్తంగా నడుస్తున్న క్రైస్తవుల చర్చిలకు ఈయనే మార్గదర్శి అని కూడా చెప్పాలి. అలాంటి పోప్ ఫ్రాన్సిస్ ఇప్పటిదాకా కనిపించని, ఇకపై ఎన్నడూ కానరాని ఆసక్తికర సన్నివేశంలో దర్శనిమచ్చారు. అది కూడా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ దిశానిర్దేశాలు జారీ అయ్యే వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్ లో దర్శనమిచ్చిన ఈ అరుదైన సన్నివేశంలో పోప్ ఒంటరిగా కనిపించారు. ఈ దృశ్యం నిజంగానే ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగనిదే. అంతేనా... భవిష్యత్తుల్లో ఇలాంటి సన్నివేశం మరోమారు కనిపించే అవకాశాలు లేవని కూడా చెప్పదగ్గది. ఎందుకిలా? అంటే... ఇంకెందుకు ప్రపంచాన్నే తీవ్రంగా భయపెడుతున్న కరోనా వైరస్... ఈ సన్నివేశానికి కారణమైంది.

తొలుత చైనా నుంచే ఈ వైరస్ ప్రస్థానాన్ని ప్రారంభించినా... ఆ తర్వాత ఇటలీని కకావికలం చేసింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇటలీలో ఇప్పటికే 87 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,134 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దాదాపుగా పది వేల మంది ప్రాణాలను హరించేసిన కరోనా.. ఇటలీని ఓ రేంజిలో అతలాకుతలం చేసిందన్న మాట. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రంగంలోకి దిగిన పోప్ ఫ్రాన్సిస్... ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ప్రభువుకు మొరపెట్టుకున్నారు. అంటే... కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను రక్షించాలని యేసు క్రీస్తును పోప్ ప్రార్థించారు. అది కూడా పై ఫొటోలో కనిపిస్తున్న రీతిగా ఒంటరిగా. ఈ తరహాలో పోప్ ప్రార్థన చేసిన సందర్భాలు ఇప్పటిదాకా లేవు. భవిష్యత్తులోనూ కనిపించే అవకాశాలే లేవు. సో... ఈ ఫొటో రేరెస్ట్ ఆప్ రేర్ అనే కంటే కూడా చాలా అరుదైనదేనని చెప్పాలి.

    

Tags:    

Similar News