పోప్ ఫ్రాన్సిస్...క్రైస్త్రవ పీఠాధిపతి. ఈస్టర్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అరుదైన ప్రేమను చూపించారు. రోమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ హిందువు పాదాలను కడిగారు. అంతేకాకుండా వారి పాదాలను ముద్దుపెట్టుకున్నారు. అంతర్జాతీయంగా వివిధ మతాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించే ప్రక్రియలో భాగంగా...11 మంది యువ శరణార్థులు, వలస కేంద్రంలో పనిచేసే ఓ ఇటాలియన్ పాదాలను పోప్ శుభ్రం చేశారు. వారి పాదాలకు నీళ్లు పోసి, కడిగి, తువ్వాలుతో తుడిచి పోప్ ముద్దు పెట్టుకున్నారు. దాన్ని సోదర స్పర్శగా అభివర్ణించారు.
ఈస్టర్ సంప్రదాయానికి గాను ఎంపిక చేసిన 11 మందిలో ఒక భారతీయ హిందువుతో పాటు నలుగురు నైజీరియన్ క్యాథలిక్కులు - ముగ్గురు ఎరిత్రియా మహిళలు - మాలీ - పాకిస్థాన్ - సిరియాలకు చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు. ఈస్టర్ సండేకు సిద్ధమవుతున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.