ప్రపంచానికి మరవలేని పాఠాన్ని నేర్పిన ప్రాంతం. జపాన్ లోని నాగసాకిపై అమెరికా అణుబాంబు వేసిన సందర్భం. రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన ఘోర విషాదాల్లో ఇదొకటి. సుమారు 39వేల మంది చనిపోయారు. అంతకు రెండు రోజుల ముందు హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబు వేసిన అమెరికా రెండు రోజులు తిరక్క ముందే మరో విషాదాన్ని జపాన్ కు రుచి చూపింది. నాగసాకిలో బాంబు వేసింది. ఈ ఘోర మారణకాండకు సంబంధించిన చిత్రాలను అమెరికా మెరైన్స్ ఫొటోగ్రాఫర్ జోయ్ ఒ డొన్నెల్ తన కెమెరాలో బంధించారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసి పోప్ స్పందించారు.
మరోమారు అణుయుద్ధం అనే రీతిలో ఉత్తరకొరియా- అమెరికా వాదోపవాదాలు సాగుతున్న నేపథ్యంలో అణు ఆయుధ వ్యతిరేక సమావేశంలో ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగసాకిపై అణు దాడి ఫొటోలను తిలకించారు. తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడి ఫోటోను చూసి పోప్ చలించిపోయారు. ప్రపంచం వణికిపోయిన యుద్ధం గురించి జోయ్ తీసిన ఈ ఫొటో చెబుతున్నంత స్పష్టంగా మరేదీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో బాలుడి బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. పళ్లతో పెదవులను అదిమిపెట్టి బాధను ఓర్చుకునేందుకు బాలుడు ప్రయత్నించాడని ఆ సమయంలో ఆ చిన్నారి భావాలు వర్ణించరాని ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయని పోప్ తెలిపారు.
1945 అణుబాంబు దాడి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా మెరైన్స్ ఫొటోగ్రాఫర్ జోయ్ ఒ డొన్నెల్ అక్కడి పరిస్థితులను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం నాలుగేళ్ల పాటు డొన్నెల్ జపాన్‌లోనే ఉండి..కొన్ని వందల చిత్రాలు తీశాడు. ఆయన తీసిన చిత్రాల్లో తమ్ముడి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్న పిల్లవాడిది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని చూసిన పోప్ ఫ్రాన్సిస్ తాజాగా స్పందించారు. ఆ పిల్లవాడి క్షోభ ప్రపంచ దేశాలకు అర్థం కావాలని, అందుకే ఈ ఫొటోను పునః ముద్రించి అందరికీ పంచాలని కోరారు. కాగా, అణు హెచ్చరికలపై కిమ్ దేశంతో చర్చలు జరిపేందుకు వాటికన్ సిటీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజా సమావేశంలో పోప్ పాల్గొన్నారు.