రాజకీయంగా వ్యాఖ్యలు వేరు.. వ్యక్తిగతంగా విమర్శించడం వేరు. కానీ ఈ రెండో విషయంలో పోసాని కృష్ణమురళి అదుపుతప్పడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఆయన పరిశ్రమ ప్రముఖ హీరో.. రాజకీయ నాయకుడు అయిన పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడడం బూతు మార్గాన్ని ఎంచుకోవడం ఇప్పుడు నెటిజనుల్లో రచ్చగా మారుతోంది.
ముఖ్యంగా ఆయన పవన్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ భార్య.. కూతురు పైనా వీరంగం వేయడంపై అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. పోసాని లాంటి అగ్ర రచయిత.. గొప్ప దర్శకనటుడు ఇలా బూతు మాట్లాడడం సరికాదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక జనసైనికులు అయితే పోసాని కనిపిస్తే తాట తీస్తాం! అన్నంతగా భగభగా మండిపోతున్నారు. పోసాని అశుద్ధపు భాషపై ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మదనపడుతున్నారు.
ఇలా ఇద్దరు ఇండస్ట్రీ దిగ్గజాల మధ్య గొడవల పర్యవసానం ఎలా ఉంటుందోనని పరిశ్రమ వర్గాల్లోనూ అలజడి నెలకొంది. అసలే సినిమా టిక్కెట్టు రేట్ల పై చర్చ సాగుతున్న వేళ పవన్ వ్యాఖ్యలు దుమారం రేపగా.. ఇప్పుడు కౌంటర్ గా పోసాని చేసిన వ్యక్తిగత విమర్శలు బూతులు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. ఇక తిట్ల దండకంలో పీహెచ్ డి చేసిన పోసాని మరీ అదుపు తప్పి బూతులు తిట్టేయడంపైనే అంతా జుగుప్సగా ఉందంటూ విరుచుకుపడుతున్నారు. అతడు ఇలా చేయడం సరికాదని తెలుగు మీడియా సైతం విమర్శించింది. ముఖ్యంగా అతడు ఉపయోగించిన భాష అశుద్ధంగా ఉందన్నది అందరి ఆరోపణ. దీనికి పోసాని సారీ చెబుతారా? లేక లైట్ తీస్కుంటారా? అన్నది చూడాలి.