జగన్‌పై నిందలు వేస్తే.. 100 అడుగుల లోతుకు పాతుకు పోతారు: పోసాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నాయకుడు, నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి.. తాజాగా ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన పోసాని.. సీఎంతో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ల ధరలపై సీఎంతో చర్చించలేదని తెలిపారు.
సీఎం జగన్ మీద నిందలు వేసిన వాడు.. భూమిలో 100 అడుగులలోతుకు పాతుకుపోతాడని హెచ్చరించారు. తాను మెంటల్ కృష్ణ సినిమాలో హీరోగా చేశానని తెలిపారు. భీమ్లానాయక్ సినిమాను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టారని సాక్ష్యం ఉంటే చెప్పాలన్నారు.
కరోనా సమయంలో తమ కుటుంబానికి సీఎం, ఆయన సతీమణి భారతి సహకరించారని పేర్కొన్నారు. జగన్‌కు కృతజ్ఞతలు తెలిపానని పోసాని కృష్ణమురళి చెప్పారు. మా కుటుంబం కరోనాతో భాదపడుతున్న సమయంలో సీఎం.. ఆయన సతీమణి ఏఐజీ ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా సహకరించారని.. అందుకే ఇప్పుడు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు పోసాని తెలిపారు. "సినిమా టికెట్లపై చిన్న సినిమాల నుంటి ప్రతిపాదనలు అందకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుంది. ఈరోజు సినిమా టికెట్ల ధరపై సిఎంతో చర్చించలేదు`` అన్నారు.
అంతేకాదు, రాజకీయ పదవుల గురించి మాట్లాడుతూ.. నటుడు ఆలీకి ఇచ్చినట్టే తనకు పదవి ఇస్తున్నారు అనడంలో వాస్తవం లేదన్నారు. ``రాజకీయంగా పదవి ఇస్తే మంచిదే కదా. ఒకవేళ ఇస్తానని అంటే.. ప్రజలకు చెప్పుకోవడానికి నాకేంటి సిగ్గు. భీమ్లానాయక్ సినిమా టికెట్ల గురించి నాకు తెలియదు.
నేను సినిమా వాడినే గానీ దాని గురించి నాకు తెలియదు. భీమ్లానాయక్ సినిమాను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టారని మీ దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి నాదగ్గర లేదు. మేము సినిమాలోనే హీరోలం రియల్ హీరో వైఎస్ జగన్. ఆయన మీద నిందలు వేసిన వారు భూమిలో 100 అడుగులలోతుకు పాతుకుపోతారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.