పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా.. రాళ్లదాడికి భయపడనన్న పోసాని

Update: 2021-09-30 11:31 GMT
గత కొన్ని రోజులుగా ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు.. సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి మధ్య మాటల యుద్ధం అల్లకల్లోలంగా మారింది. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ పై వ్యక్తిగత విమర్శలతో దుమ్మెత్తిపోశాడు పోసాని. దీనికి పవన్ సైతం మళ్లీ నిన్న విజయవాడ జనసేన కార్యాలయంలో ఘాటుగా స్పందించారు. అనంతరం రాత్రి పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిపై సంజీవరెడ్డినగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన ఇంటిపై రాళ్లదాడి ఘటనపై పోసాని తీవ్రంగా స్పందించారు, పవన్ కళ్యాణ్ అభిమానులు రాళ్ల దాడి చేశారని ఆరోపించారు.

పోసాని మాట్లాడుతూ "నేను ఇలాంటి దాడులకు భయపడను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా నాయకుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ” అని పోసాని అన్నారు. గతంలో ఇలాంటి అనేక సంఘటనలను ఎదుర్కొన్నానని పోసాని చెప్పారు. "పవన్ కళ్యాణ్ సొంత భాషలో చెప్పాలంటే నేను నా కెరీర్‌లో ఇలాంటి సన్నాసులను ఎన్నో చూశాను. అటువంటి రాళ్ల దాడి.. భౌతిక దాడులకు నేను నిరుత్సాహపడను. నిజానికి, అవి నన్ను మరింత బలపరుస్తాయి”అని పోసాని చెప్పాడు.

తాను కూడా జన సేన చీఫ్‌పై అలాంటి దాడులకు పాల్పడగలనని పోసాని పేర్కొన్నాడు. ఆ పని చేయడానికి తనకు అభిమానులు అవసరం లేదని అన్నారు. "నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. నేను నేరుగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టగలను. అతను, అతని మనుషులు ఏమి చేయగలరు? మహా అయితే వారు నన్ను చంపుతారు, ”అని పోసాని చెప్పుకొచ్చాడు. సీనియర్ నటుడు పవన్ మొదటి నుంచీ సైకోగానే ఉండేవాడని పలు ఉదాహరణలు కూడా పోసాని చెప్పుకొచ్చాడు.

"పవన్ బయట అస్సలు ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేక దాడులు చేస్తుంటాడు. ఎవరూ అతడిని షూటింగ్లో తాకకూడదు. సినిమా షూటింగ్‌ల సమయంలో కూడా అతను కోపంతో ఎవరినైనా కొట్టగలడు. కానీ ఎవరైనా ప్రతీకారం తీర్చుకుంటే అతను సహించడు. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో పాపం తప్పు లేకున్నా కోడైరెక్టర్ ను కొట్టాడు. తెలిశాక కూడా సారీ చెప్పలేదు.”అని పోసాని సంచలన కామెంట్స్ చేశాడు. అలాంటి నిలకడ లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు అని పోసాని విమర్శించాడు.

రాజకీయాల్లో కార్యకర్తలు నాయకుడిని అనుసరిస్తారు. అభిమానులు ఇంత దారుణంగా దాడులతో అనుచితం ప్రవర్తిస్తుంటే, నాయకుడైన పవన్ పెద్ద సైకో అని అర్థం ”అని పోసాని నిప్పులు చెరిగారు.

పవన్ అభిమానులు తన భార్యను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోసాని ప్రశ్నించాడు. "ఆమె ఏ విధంగా రాజకీయాలకు సంబంధించినది? పవన్‌కు భార్య, తల్లి కూడా ఉన్నారు. నేను వారికి వ్యతిరేకంగా దూషణ పదాలు ఉపయోగిస్తే అతను ఎలా భావిస్తాడు?’ పోసాని మండిపడ్డారు.


Full View
Tags:    

Similar News