పెళ్లింట కలకలం: కొత్త జంటతోపాటు 42 మందికి పాజిటివ్

Update: 2020-07-26 06:00 GMT
వైరస్ విజృంభణలో ప్రభుత్వాలను ఎంత విమర్శలు చేస్తున్నా ప్రజల తప్పులు కూడా ఉన్నాయి. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఆ వైరస్ దావానంలా వ్యాపించడానికి కారణమవుతోంది. గతంలో ఢిల్లీలో జరిగిన ప్రార్ధనలే ఉదాహరణ. ఇప్పుడు అలాంటి నిర్లక్ష్యమే ప్రజలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఉన్న విషయం మరిచి శుభకార్యాలు.. వేడుకలు చేసుకుంటున్నారు. ఫలితంగా వైరస్ ను కోరి కోరి తెప్పించుకుంటున్నట్లు పరిస్థితులు ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. నిర్లక్ష్యం కారణంగా పెళ్లయిన కొత్త దంపతులతో పాటు వారికి చెందిన  42 మందికి పాజిటివ్ అని తేలడంతో ఆ పెళ్లి ఇల్లు కాస్త హోం ఐసోలేషన్ కేంద్రంగా మారింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

 
వైరస్ ను విజయవంతంగా కేరళ ప్రభుత్వం కట్టడి చేస్తుండగా ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా చెంగల గ్రామంలో ఇటీవల ఓ వివాహ ఘనంగా జరిగింది. కొన్ని రోజులకు ఆ కుటుంబ పెద్ద వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు చేయడంతో పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబంలో కలకలం రేగింది. అతడికి వైరస్ రావడానికి కారణం తెలుసుకున్నారు. పెళ్లి జరిగిందని తెలియడంతో ఆ వివాహానికి వచ్చిన వంద మందిని పరీక్షించారు. వారిలో ఏకంగా 42 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారిలో ఆ కుటుంబసభ్యులతో పాటు నవ దంపతులకు కూడా పాజిటివ్ అని తేలింది. పెళ్లికి హాజరైన అన్ని కుటుంబాలను 14 రోజుల పాటు క్వారైంటన్ చేశారు. ఈ విధంగా కొందరి నిర్లక్ష్యం అంత మందికి వైరస్ పాకేలా కారణమైంది. ఇకనైనా జాగ్రత్తగా ఉందాం.. ఆరోగ్య సమాజం కోసం కృషి చేద్దాం.
Tags:    

Similar News