శ్రీలంక టూర్ లో ఉన్న ఇండియన్ టీమ్ లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీనితో, మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లూ ఐసోలేషన్ లో ఉన్నాయి. ఇక కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో నేడు జరగాల్సిన ఇండియా శ్రీలంక రెండో టీ20 మ్యాచ్ వాయిదా పడింది. మిగతా ఆటగాళ్లందరికీ కరోనా వైరస్ టెస్టుల్లో నెగిటివ్ అని తేలితేనే రేపు మ్యాచ్ జరిగే అవకాశం ఉందని, లేకపోతే మ్యాచ్ జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇప్పటికే లంక గడ్డపై శిఖర్ ధావన్ నాయకత్వంలోని యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా,టీ20 సిరీస్ లోనూ శుభారంభం చేసింది. గత ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ ను గెలుచుకున్న టీమిండియా, రెండో మ్యాచ్ ను కూడా గెలుచుకుని మూడు మ్యాచ్ ల టీ20 సీరిస్ ను సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా సభ్యుడు కృనాల్ పాండ్యాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో నేడు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను నిర్వాహకులు వాయిదా వేశారు.
మిగతా ఆటగాళ్లందరికీ పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలితేనే రేపు ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న నేపథ్యంలో రెండో టి20 జరిగే పరిస్థితులు ఉంటాయా, లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఇండియా 38 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కృనాల్ ఆడాడు. రెండు ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండు రోజుల ముందే అతడు రెండు టీమ్స్ లోని ప్లేయర్స్ తో కలిసి ఆడాడు. దీనితో ఇంగ్లండ్ లో ఉన్న టెస్ట్ టీమ్ తో కలవాల్సిన ఉన్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వి షా ప్రయాణంపై ఇది ప్రభావం చూపనుంది. ఈ ఇద్దరూ అక్కడ గాయపడిన శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో వెళ్లాల్సి ఉంది.