విజయవాడలో ఒక పోస్టర్ కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తం అయ్యేలా చేయటంతో పాటు.. సీసీ కెమేరా ఫుటేజ్ ల్ని పరిశీలించటం మునిగిపోయారు. విజయవాడ నడిబొడ్డున ఉండే సత్యానారాయణపురంలోని నర్రా వీధి.. శివాలయం వీధుల్లో ఒక పోస్టర్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు.
పరువు హత్యకు గురి కానున్న.. రాహు.. సోని.. ప్రియ అంటూ ఉన్న ఈ పోస్టర్ల వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. మిర్యాలగూడలో చోటు చేసుకున్న కుల ఉన్మాద హత్య నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఏమైనా ప్రేమ వివాహాలు చోటు చేసుకున్నాయా? అంటూ ఆరా తీశారు.
అలాంటి వివరాలేమీ దొరక్కపోవటంతో.. ఈ రెండు ప్రాంతాల్లోని సీసీ కెమేరా ఫుటేజ్ ని పరిశీలించారు. ఇందులో ఒక వ్యక్తి ఈ పోస్టర్లు అంటిస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే.. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల ప్రయత్నాలు ఫలించి.. పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని విచారించిన పోలీసులకు నోట మాట రాని పరిస్థితి.
సత్యనారాయణ పురానికి చెందిన చిట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ పోస్టర్లు అంటించినట్లు గుర్తించారు. అతడికి మతిస్థిమితం సరిగా ఉండదని.. అతడు అంటించిన పోస్టర్లలో ఉన్న పేర్లు మరెవరో కావని.. రాహుల్ గాంధీ.. సోనియా గాంధీ.. ప్రియాంక గాంధీ అని తేల్చారు. హోదా నేపథ్యంలో ఇలాంటి పోస్టర్లు తయారుచేసినట్లు గుర్తించారు.