బ్రిటీష్ కాలంలో మొదలైనా.. నేడు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన సమయంలోనూ తపాలా శాఖ భారతదేశంలో విశేష సేవలు అందిస్తోంది. తనకు తాను మారుతూ సాంకేతికతను జోడించి ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంతో తపాలా శాఖ అద్భుత సేవలు అందిస్తోంది. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితిలోనూ తపాలా శాఖ విశేష సేవలు అందించడం విశేషం. కరోనా కట్టడిలోనూ ఆ సంస్థ సేవలో మునిగింది. తపాలా శాఖ పెద్ద వ్యవస్థ. ఈ సంస్థ అంతర్జాతీయ - జాతీయతో పాటు పల్లె స్థాయి వరకు కూడా సేవలు అందిస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ ఆ శాఖ తన పాత్ర పోషిస్తోంది. సాధారణ సేవలు మినహాయించి అత్యావసర వస్తువులను మాత్రమే బట్వాడా చేస్తోంది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం వైద్యారోగ్యకు తపాలా శాఖ సహాయం చేస్తోంది.
వైద్య పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలోని అన్ని ప్రాంతాలకు తరలించనుంది. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు ప్రయాణాలు చేయడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయిన నేపథ్యంలో అత్యవసరమైన వైద్య పరికరాలు - ఔషధాలను ఆయా ప్రాంతాలకు తపాలా శాఖ రవాణా చేస్తూ సహాయం చేస్తోంది.
మార్చి 24వ తేదీ నుంచి భారతదేశంలో ప్రకటించిన లాక్ డౌన్ తో నిత్యావసర సేవలు మినహా అన్ని వ్యాపారాలను మూసివేయాలని - ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సత్వర వైద్యం అందించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో అవసరమైన ప్రాంతాలకు అత్యావసర ఔషధాలు తరలించాల్సి ఉంది. గుండె జబ్బులు, - క్యాన్సర్ వంటి వాటికి అవసరమైన అత్యవసర ఔషధాలు - మందులు - వైద్య పరికరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ వాటిని తరలించేందుకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి.
పోస్టల్ సర్వీస్‌కి దేశవ్యాప్తంగా సంపూర్ణ వ్యవస్థ ఉంది. లాక్ డౌన్ సమయంలో 'నిత్యావసర సేవలు'గా పరిగణించి, పనిచేయటానికి అనుమతించిన అతి తక్కువ పరిశ్రమల్లో పోస్టల్ సర్వీసు ఒకటి. మార్కెట్ లో ఔషధాలకు కొరత రాకుండా చూడటానికి - ఎవరూ అనవసరంగా నిల్వలు చేసుకోకుండా ఉండటానికి పోస్టల్ రవాణా తోడ్పడుతోంది. తమకు అత్యవసరమైన కోవిడ్-19 టెస్టింగ్ కిట్లు 550 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీలో చిక్కుకుపోతే లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఉజ్జల ఘోషల్ కు అందించాయి.
భారతీయ పోస్టల్ వ్యాన్లు రోజుకు వేల సంఖ్యలో ట్రిప్పులు వేస్తాయి. చాలా ఇతర సంస్థలు, -కంపెనీలు కూడా ప్రస్తుతం తపాలా శాఖను సంప్రదిస్తూ తమకు అవసరమైన వస్తువులు, పరికరాలను పొందుతున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ అత్యవసరమైన మందులు - కోవిడ్-19 టెస్ట్ కిట్లు - ఎన్95 మాస్కులు - వెంటిలేటర్ల నుంచి గమ్యస్థానాలకు చేరవేసేందుకు తపాలా శాఖ పని చేస్తోంది. ప్రధాన నగరాలు - రాష్ట్రాల మధ్య మందులు - పరికరాలను తపాలా శాఖ రవాణా చేస్తూ వైద్యారోగ్య సేవలకు సహకారం అందిసత్ఓంది. ఈ విధంగా కరోనా కట్టడి కోసం తపాలా శాఖ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రత్యేక వస్తువులను తరలించే క్రమంలో కూడా తపాలా శాఖ అత్యంత జాగ్రత్తగా తరలిస్తున్నాయి. మందులు - పరికరాలు కావడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో కొన్ని మందులు చల్లటి ప్రాంతంలోనే ఉంచాలి. ఈ నేపథ్యంలో మందులు శీతలీకరణలో ఉంచుతూ తపాలా శాఖ రవాణా చేస్తోంది.